ఫ్యాన్స్ కి మహేశ్ బాబు లేఖ.. అందులో ఏముందంటే?

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు పూరశురామ్ దర్శకత్వం వహించారు. హీరోయిన్ గా కీర్తి సురేష్ నటించింది. త్వరలో సర్కారు వారి పాట సినిమా విడుదల కానున్న సందర్భంగా మహేశ్ బాబు తన అభిమానులకు ఓ లేఖ రాశారు.. 

ఆ లేఖలో ఏం రాశారంటే..‘దర్శకుడు పరశురామ్ దర్శకత్వం వహించిన సర్కారు వారి పాట షూటింగ్ పూర్తయి, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని, మే 12న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలవుతోంది. ఈ చిత్రం ఆడియో సరేగమ కంపెనీ ద్వారా మార్కెట్ లో విడుదలై రేటింగ్ లో విశేష సంచలనం సృష్టిస్తోంది. ఎన్నో అంచనాలతో, ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న మన సర్కారు వారి పాట చిత్రం థియేటర్లలోనే చూసి మీ స్పందన తెలియజేయండి’.. అంటూ రాశారు. 

అంతేకాదు ఆ లేఖలో.. సర్కారు వారి పాట సినిమాతో పాటు ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోయే సినమా గురించి ప్రస్తావించారు. ‘మాటల మాంత్రికుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై యస్.రాధాక్రిష్ణ నిర్మించే చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్ లో మొదలు కానుంది’ అంటూ వెల్లడించారు.  

 

 

Leave a Comment