సంజనా గనేషణ్ తో టీమిండియా పేసర్ బుమ్రా పెళ్లి..!

కొత్త కొద్ది రోజులుగా టీమిండియా పేసర్ జస్ ప్రీత్ బుమ్రా పెళ్లి వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉంది. బుమ్రాకు కాబోయే వధువు ఎవరన్న దానిపై రకరకాల పుకార్లు వచ్చాయి. నటి అనుపమను పెళ్లి చేసుకుంటున్నాడని, అందుకోసమే క్రికెట్ నుంచి విరామం తీసుకొని గుజరాత్ వెళ్లాడని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను అనుపమ తల్లి ఖండించారు. బుమ్రాను అనుపమ పెళ్లి చేసుకోవడం లేదని వెల్లడించారు. దీంతో ఆ ఊహాగానాలకు తెరపడింది. 

తాజాగా బుమ్రా ప్రముక క్రీడా వ్యాఖ్యాత సంజన గణేశన్ తో పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. మార్చి 14, 15 తేదీల్లో గోవాలో వీరి పెళ్లి జరుగనుందని నివేదికలు వెలువడుతున్నాయి. అయితే బుమ్రా మాత్రం తన వ్యక్తిగత జీవితం గురించి ఎవరితోనూ పంచుకోలేదు. తన పెళ్లి విషయంలోనూ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. దీంతో బుమ్రా పెళ్లి విషయంలో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి.  

Leave a Comment