కిలిమంజారోపై జెండా ఎగురేసిన ఏడేళ్ల హైదరాబాది కుర్రాడు..!

ఆఫ్రికా ఖండంలోని అతిపెద్ద పర్వతమైన కిలిమంజారో శిఖరాన్ని ఏడేళ్ల కుర్రాడు అధిరోహించాడు. సికింద్రాబాద్ కు చెందిన తేలుకుంట్ల విరాట్ చంద్ర మార్చి 6న కిలిమంజారోపై భారతీయ జెండా ఎగురవేశాడు. కోచ్ తమ్మినేని భరత్ వద్ద 75 రోజుల పాటు కఠినమైన శిక్షణ తీసుకున్నాడు.

ఆ తర్వాత కోచ్, తండ్రి సహాయంతో ఈనెల 2న పర్వతారోహన చేపట్టగా 6న కిలిమంజారో గమ్యస్థానానికి చేరుకున్నాడు. అక్కడ జాతీయ పతాకాన్ని ఎగురవేశాడు. చిన్న వయస్సులోనే పర్వతారోహణలో విశేష ప్రతిభ చూపుతున్న విరాట్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

కాగా, దీని కోసం విరాట్ కఠినమైన శిక్షణ తీసుకున్నట్లు కోచ్ భరత్ తెలిపారు. శిక్షణ కోసం ప్రతి రోజు సమాయానికి వచ్చేవాడన్నారు. శిక్షణలో భాగంగా ప్రతి రోజూ ఆరు కిలోమటర్లు పరిగెత్తడం, కొండపైకి ఎక్కడం మరియు యోగా చేయడం వంటివి చేసేవాడని కోచ్ తెలిపారు. తన తల్లిదండ్రులు, కోచ్ తో కలిసి విరాట్ మార్చి 15న స్వదేశానికి తిరిగి వస్తాడు.       

 

Leave a Comment