కొత్త విద్యా విధానంలో జనసేనాని ఆలోచనలు..!

కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది. ఐదో తరగతి వరకు మాతృ భాషలోనే పాఠాలు నేర్పిస్తారు. పిల్లలు తమకు నచ్చిన కోర్సులను ఎంపిక చేసుకోవచ్చు. అన్ని కోర్సులను రెండు భాషలలో అందిస్తారు. అన్ని పాఠశాలలో సంస్కృత భాషను ముఖ్య భాషగా ప్రవేశపెడతారు. డిజిటల్ విద్య విధానాన్ని అభివృద్ధి చేసేందుకు నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరం స్థాపిస్తారు. ఇలా ఎన్నో నూతన మార్పులను కేంద్ర ప్రభుత్వం చేసింది.

అయితే ఈ నూతన విద్యా విధానం రూపకల్పనలో పవన్ కళ్యాన్ పాత్ర కూడా ఉందని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. నూతన విద్యా విధానంలో పవన్ ఆలోచనలకు స్థానం కల్పించినట్లు చెప్పారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ 2019లో మాట్లాడిన వీడియోను ట్వీట్ చేశారు. నూతన విద్యా విధానంలో కేవలం కొన్ని కోర్సులే కాకుండా విద్యార్థులకు వారి సొంత సబ్జెక్టులను ఎన్నకునే అవకాశం కల్పిస్తుందని చెప్పారు. 

ఆ వీడియోలో పవన్ ఏమన్నారంటే ‘విద్యార్థికి సబ్జెక్టు ఎన్నుకునే అవకాశం కల్పిస్తే బాగుంటుంది. నాకు అలాగే అనిపించేది. నేను చదువుకునే రోజుల్లో నాకు వేరే ఏదైనా కోర్సు చదువుకోవాలని ఉండేది. ఏదైనా వృత్తి విద్య కానీ, పెయింటింగ్ కానీ నేర్చుకోవాలని ఉండేది. వృత్తి విద్యను నేర్పడం ద్వారా యువతకు ఎంతో మేలు జరుగుతుంది. స్కూల్ నుంచి కళాశాల స్థాయిలో ఒక స్కిల్ కానీ, ఒక కళ కానీ వారి నైపుణ్యాభివృద్ధికి తోడ్పడే దానిని నేర్పించాలి. కొత్త విద్యా విధానం తీసుకొస్తే అందులో వీటిని పొందుపరచాలి’ అని చెప్పారు.  

Leave a Comment