కరోనా టెస్టుల్లో ఏపీవి తప్పుడు లెక్కలు..ఇదిగో సాక్ష్యం : చంద్రబాబు

కరోనా టెస్టుల విషయంలో ఏపీ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. తప్పుడు లెక్కలతో ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన శాంపిల్స్ టెస్టుల జాబితాను పోస్ట్ చేశారు. పది లక్షల మందికి రోజుకు సగటున కనీసం 140 టెస్టులు కూడా చేయడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో ఆంధ్రప్రదేశ్ పేరు లేదన్నారు. ఈ జాబితాలో ఏపీ ఎందుకు స్థానం దక్కించుకోలేకపోయిందని, తప్పుడు లెక్కలతో ఎందుకు మోసం చేస్తుందని ప్రశ్నించారు.

Leave a Comment