ఇంగ్లిష్ మీడియంకు క‌ట్టుబ‌డి ఉన్నాం :  మంత్రి ఆదిమూల‌పు సురేష్‌

జాతీయ విద్యా విధానంలోని చాలా అంశాలు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అమలు చేస్తున్నవే ఉన్నాయ‌ని విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ అన్నారు. సీఎం జ‌గ‌న్ ఆలోచ‌న‌లు, భావ‌జాలం, సంస్క‌ర‌ణ‌లు ఈ విధానంలో ఉన్నాయని తెలిపారు. గత ప్రభుత్వం విద్యను వ్యాపార ధోర‌ణిలో చూసి కార్పొరేట్ సంస్థలకు కొమ్ముగాస్తే, సీఎం జ‌గ‌న్ మాత్రం విద్యను పేదలకు హక్కుగా అందించాలని ఆకాంక్షించారని తెలిపారు. ఆ ఆలోచనే నేడు కేంద్ర విద్యా విధానంలో ఉందన్నారు.

ఆర్థిక ఇబ్బందులతో ఏ విద్యార్థి ఉన్నత విద్యకు దూరం కాకూడదని చెప్పారు. గురువారం ఆయ‌న స‌చివాల‌యం నుంచి మాట్లాడుతూ.. “ప్రభుత్వ రంగంలో మొదటి సారి ప్రి ప్రైమరీ విద్యను కూడా తీసుకొస్తున్నాం. ఇంగ్లిష్‌ మీడియంపై కేంద్రం చాలా స్పష్టంగా చెప్పింది. అవకాశం ఉన్నంత వరకు మాతృ భాషను అమలు చెయ్యమని చెప్పింది. అంతే కాదు 2 నుంచి 8 మధ్య వయస్సున్న‌ పిల్లలు భాషలు త్వరగా నేర్చుకోగలరని, భాషలు నేర్చుకోవాలంటే మీడియం ఒక్కటే కారణం కాదని తెలిపింది. మేం ఇంగ్లిష్‌ మీడియంకు కట్టుబడి ఉన్నాం. తెలుగును ఎక్కడా నిర్లక్ష్యం చెయ్యలేదు. ప్రతి ఒక్కరు మా గ్రామానికి ఇంగ్లిష్‌ మీడియం స్కూల్ వస్తుంది అని ఎదురుచూస్తున్నారు. పూర్తిగా తెలుగుమీడియం ఉండాలంటే ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు రెండింటిలోను అమలు చేయాల్సి ఉంటుంది” అని ఆదిమూల‌పు సురేష్ పేర్కొన్నారు.

 

Leave a Comment