జూన్ 5 నుంచి జన్ ధన్ నిధులు జమ

కరోనా వైరస్ ప్రభావంతో పేదలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ప్యాకేజీ ద్వారా నిరుపేద మహిళలకు నెలకు రూ.500 చొప్పున ఆర్థిక సాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. అందులో భాగంగా జన్ ధన్ అకౌంట్లు ఉన్న 20 కోట్ల మహిళలకు నెలకు 500 చొప్పున మూడు నెలల వరకు ఇస్తామని ప్రకటించింది. ఇప్పటికే రెండు విడతల నగదు బదిలీ చేసింది. ప్రస్తుతం మూడో విడత డబ్బులు అందజేసేందుకు కసరత్తు చేస్తోంది. 

జన్ ధన్ ఖాతాదారులకు మూడో విడత నగదు జూన్ 5 నుంచి జమ చేయనున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. ఈ ప్రక్రియ జూన్ 10 వరకు కొనసాగుతుందని వెల్లడించింది. అయితే కరోనా వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో ఏటీఎం వద్ద ప్రజలు గుమిగూడే అవకాశం ఉండటంతో నగదును ఐదు రోజులు, ఐదు విడతల్లో జమ చేయనుంది. అయితే లబ్ధిదారులు ఎప్పుడైనా డబ్బులు విత్ డ్రా చేసుకునే వెసులు బాటును కల్పించింది. 

అకౌంట్ నెంబర్ల వారీగా నగదు బదిలీ..

  • జూన్ 5 – అకౌంట్ నెంబర్ చివర్లో 0 లేదా 1 నెంబర్ ఉన్నవారికి
  • జూన్ 6 – అకౌంట్ నెంబర్ చివర్లో 2 లేదా 3 నెంబర్ ఉన్న వారికి
  • జూన్ 8 – అకౌంట్ నెంబర్ చివర్లో 4 లేదా 5  నెంబర్ ఉన్న వారికి
  • జూన్ 9 – అకౌంట్ నెంబర్ చివర్లో 6 లేదా 7 నెంబర్ ఉన్న వారికి
  • జూన్ 10 – అకౌంట్ నెంబర్ చివర్లో 8 లేదా 9 నెంబర్ ఉన్న వారికి

Leave a Comment