పొలంలో దొరికిన లంకెబిందెలు..బంగారు ఆభరణాలు..

పూర్వకాలంలో దొంగల భయంతో నగలను, నాణేలను బిందెల్లో దాచి పూడ్చిపెట్టేవారు. ఈ విషయం దాచిన వారికి తప్ప ఎవరికీ తెలియదు. అత్యంత ఆప్తులకు మాత్రమే ఈ విషయాలను చెప్పేవారు. కాలక్రమేణా ఎక్కడ పూడ్చారో తెలియక మరిచిపోవడం, లేదా మరణించడంతో ఎన్నో గుప్తనిధులు ఇంకా భూమిలోనే ఉండిపోయాయి. పొలం దున్నే సమయాల్లో, ఇంటి నిర్మాణాల్లో అలాంటి బయటపడుతుంటాయి. 

ఇదంతా ఇప్పుడు ఎందుకనుకుంటున్నారా..తాజాగా వికారాబాద్ జిల్లా పరిగిలో మండల్ సుల్తాన్ పూర్ గ్రామంలో బుల్లి లంకెబిందెలు బయటపడ్డాయి. ఆరు రాగి పాత్రల్లో బంగారు నాణేలు, ఆభరణాలు, వెండి నాణేలు ఉన్నాయి. గ్రామానికి చెందిన సిద్ధిఖీ తండ్రి యాకుబ్ అలీ తన పొలంలో మొరం తవ్వుతుండగా అవి బయటపడ్డాయి. ఈ విషయం అనోటా ఈనోటా పాకి రెవెన్యూ అధికారులకు, పోలీసులకు తెలిసింది. గ్రామానికి చేరుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దొరికిన ఈ గుప్తనిధులు ప్రభుత్వ ఖజానాలోకి వెళ్లిపోనున్నాయి. 

Leave a Comment