‘అమ్మా నా భార్య మోసం చేసింది.. నేను చనిపోతున్న’.. కన్నీళ్లు పెట్టిస్తున్న సెల్ఫీ వీడియో..

వైవాహిక జీవితంలో ఎక్కువగా మోసపోయేది, వేధింపులకు గురయ్యేవారు భార్యలే.. అయితే భార్యల చేతిలో మోసపోతున్న భర్తలూ ఉన్నారు. శారీరక సుఖం కోసం భర్తలను మోసం చేసి అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఈ అక్రమ సంబంధాల మోజులో కట్టుకున్న భర్తను కూడా చంపేసేవారు ఉన్నారు. మరికొంత మంది భర్తలు, భార్య మోసాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.. 

తాజాగా అలాంటి ఘటనే ఏపీలోని కృష్ణ జిల్లాలో చోటుచేసుకుంది. ఒక యువకుడు తన భార్య చేతిలో మోసపోయి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఏడుస్తూ తీసుకున్న సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కృష్ణ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలోని మిత్తగూడెం ప్రాంతానికి చెందిన ఆళ్ల వెంకటేశ్వరరావు బైక్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. కొంతకాలం క్రితం కృష్ణవేణి అనే యువతితో వివాహమైంది. కొన్నాళ్లు వీరి కాపురం సజావుగానే సాగింది. 

ఓ రోజు తన భార్య ఫోన్ లో మాట్లాడుతుండగా ఎవరితో మాట్లాడుతున్నావని వెంకటేశ్వరావు నిలదీశాడు. మా అక్కతో మాట్లాడుతున్నానని చెప్పింది. ఆ నెంబర్ కు కాల్ చేయగా.. అవతల మగాడి గొంతు వినపడింది. దీనిపై వెంకటేశ్వరరావు భార్యను నిలదీశాడు. ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. దీంతో కృష్ణవేణి పుట్టింటికి వెళ్లిపోయింది. తిరిగా కాపురానికి రావాలని కోరినా వినలేదు. పైగా వేధింపులకు గురిచేసింది. దీంతో మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

సెల్పీ వీడియోలో ఆవేదన..

చనిపోయే ముందు వెంకటేశ్వరరావు సెల్ఫీ వీడియో ద్వారా తన ఆవేదన చెప్పుకున్నాడు. ‘నా చావుకు గోగుల వీరబాబు, నా భార్య కృష్ణవేణి, గోగుల సత్యవతి, వెంకన్న, కృష్ణవేణి అక్క బిందు కారణం.. పోలీసులు వీరిపై కఠిన చర్యలు తీసుకోండి..అమ్మా నన్ను క్షమించు.. నేను ఇంక నీతో మాట్లాడలేను అమ్మ. ఇదే లాస్ట్ మాట అమ్మ.. నేను చచ్చిపోతున్నా.. మీరు మాత్రం నా గురించి ఆగం కావొద్దమ్మ.. ఇద్దరు తమ్ముళ్లను మంచిగా చూసుకో.. జీవితంలో ఏమీ చూడకుండా.. 24 ఏళ్లకే చనిపోతున్న. నాకు చావాలని లేదు. నా భార్య కృష్ణవేణి నన్ను మోసం చేసింది. అందుకే చనిపోతున్న. నా శవాన్ని కూడా కృష్ణవేణిని ముట్టుకోనివ్వద్దు. నేను చనిపోయిన తర్వాత నా చేతిపై ఉన్న తన పేరు(పచ్చబొట్టు)ను తీసేసి నన్ను పూడ్చండి.. నన్ను మంటల్లో కాల్చకండి.. కొంచెం కాలిన నేను తట్టుకోలేను. అందుకే నన్న గుంతలో పూడ్చండి. నేను నమ్మిన వారే నన్ను మోసం చేశారు’ అంటే కన్నీళ్లు పెట్టుకుంటూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. 

 

Leave a Comment