అమ్మఒడిలో రూ.వెయ్యి టాయిలెట్ల నిర్వహణకు : సీఎం జగన్

ఇవాళ దేవాలయాల్లో విగ్రహాలు పగలగొడుతున్నారని, రాబోయే రోజుల్లో బడులపై విధ్వంసం చేస్తారేమో అని సీఎం జగన్ విమర్శించారు. విద్రోహ శక్తుల పట్ట అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతిష్టాత్మకమైన జగనన్న అమ్మఒడి రెండో ఏడాది చెల్లింపులను సీఎం జగన్ సోమవారం ప్రారంభించారు. 

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ అమ్మఒడి ద్వారా 45 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. అమ్మఒడి రెండో విడత ద్వారా రూ.6,673 కోట్లు అందిస్తున్నామన్నారు. ఈ ఏడాది 4 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారన్నారు. అమ్మఒడి రూ.15 వేలలో ఒక వెయ్యి రూపాయలను పాఠశాలల్లో టాయిలెట్ నిర్వహణకు కేటాయిస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. 

పాఠశాలల్లో టాయిటెట్లు మెరుగ్గా లేకపోతే హెచ్ఎం, స్కూల్ కమిటీలను ప్రశ్నించవచ్చన్నారు. మెయింటెనెన్స్ కోసం ఇచ్చే ఫండ్స్ ను కలెక్టర్ల పేరుతో ఏర్పాటు చేస్తున్నామన్నారు. వాటిని టాయిలెట్స్ కు మాత్రమే వాడతారన్నారు. టాయిలెట్ల నిర్వహణ సరిగ్గా లేకపోతే 1902 ఫోన్ చేయవచ్చని, ఆ ఫోన్ కు నేరుగా సీఎంవో రంగప్రవేశం చేస్తుందని చెప్పారు. గ్రామ సచివాలయాల్లో కూడా ఫిర్యాదు చేయవచ్చని సీఎం తెలిపారు.  

Leave a Comment