డ్రాగా ముగిసిన మూడో టెస్టు..!

సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు డ్రాగా ముగిసింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 407 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో టీమిండియా 334/5 పరుగులతో ముగించింది. ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు ఎంత ప్రయత్నించినా టీమిండియాను ఆలౌట్ చేయలేకపోయింది. చివరి వరకు ప్రయత్నించి మరో ఓవర్ మిగిలుండగా డ్రాకు అంగీకరించింది.

ఇక భారత బ్యాట్స్ మెన్స్ అసలైన టెస్టు క్రికెట్ ఎలా ఆడాలో మరోసారి నిరూపించారు. టీమిండియా ఆటగాళ్లు హనుమ విహారి, రవీంద్రన్ అశ్విన్ వికెట్లు పడకుండా జాగ్రత్తగా ఆడారు. విహారి 161 బంతులు ఆడి కేవలం 23 పరుగులే చేశాడు. దీంతో భారత్ తరపున స్లోయస్ట్ ఇన్నింగ్స్ ఆడిన జాబితాలో విహారీ చోటు సంపాదించుకున్నాడు. 

కాగా, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 338 పరుగులు చేయగా, భారత్ 244 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక సెకండ్ ఇన్సింగ్స్ లో ఆసీస్ 6 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసి టీమిండియాకు 407 పరుగులు భారీ లక్ష్యాన్ని పెట్టింది. ఇక రెండు జట్ల మధ్య చివరి టెస్టు జనవరి 15 నుంచి బ్రిస్బేన్ వేదికగా ప్రారంభంకానుంది. 

Leave a Comment