అమ్మఒడి వద్దనుకుంటే ల్యాప్ టాప్ ఇస్తాం : సీఎం జగన్

అమ్మఒడి పథకంలో వినూత్నమైన మార్పును సీఎం జగన్ తీసుకొచ్చారు. అమ్మ ఒడి ద్వారా ఇచ్చే సొమ్మును అక్కచెల్లెమ్మలు మరింత వినియోగించుకునేలా వచ్చే ఏడాది నుంచి మరో ప్రత్యామ్నాయ ఆప్షన్ ఇస్తున్నామని సీఎం జగన్ ప్రకటించారు. 9 నుంచి 12 వరకు చదివే పిల్లల తల్లులకు డబ్బులు కావాలంటే డబ్బులు తీసుకోవచ్చని, లేదంటే ల్యాప్ టాప్ తీసుకోవచ్చని వెల్లడించారు. 

ఈ ల్యాప్ టాప్ 4 జీబీ ర్యామ్, 500 జీబీ హార్డ్ డిస్క్, విండోస్ 10 ఓఎస్ ఫీచర్స్ తో ఉంటుందన్నారు. మూడేళ్ల వారంటీతో కూడి ల్యాప్ టాప్ లను విద్యార్థులకు అందిస్తామన్నారు. రాబోయే మూడేళ్లలో ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సేవలు అందించడంతో పాటు అండర్ గ్రౌండ్ ఇంటర్నెట్ కేబుల్ ను ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు. 

 

Leave a Comment