గుడ్ న్యూస్.. ఎట్టకేలకు డెంగ్యూ జ్వరానికి మందు కనిపెట్టిన లక్నో శాస్త్రవేత్తలు..!

లక్నోలోని సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ శాస్త్రవేత్తలు శుభావార్త అందించారు. డెంగ్యూ జ్వరానికి ప్రత్యేకంగా మందును కనిపెట్టినట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. ఇప్పటి వరకు డెంగ్యూ జ్వరానికి ప్రత్యేకమైన మందు లేదు. ఫ్లూయిడ్స్ ను అధికంగా శరీరంలోకి పంపించడం, ప్టేట్ లెట్ల లెక్క పడిపోకుండా చూడడం.. ఇలా డెంగ్యూ బారిన పడిన వారికి కాపాడుకుంటూ వస్తున్నారు. 

ఈక్రమంలో లక్నోలోని సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ డెంగ్యూ జ్వరానికి మందును కనిపెట్టారు. అంతేకాదు ఈ ఔషధాన్ని మనుషులపై ప్రయోగించేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి కూడా పొందినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. త్వరలోనే దేశంలోని 20 నగరాల్లో హ్యూమన్ ట్రయల్స్ చేయబోతున్నారు. 

ఈ ఔషధం వివరాలు:

ఈ ఔషధాన్ని మొక్కల ఆధారిత పదార్థంతో తయారు చేశారు. ఇది ఒక యాంటీ వైరల్ మందు..  దీనిని AQCH అని పిలుస్తారు. ముందుగా ఈ ఔషధాన్ని ఎలుకలపై ప్రయోగించారు. ఈ ప్రయోగం విజయవంతమైంది. దీనిని మనుషులపై ప్రయోగం చేయనున్నారు. 18 ఏళ్లు నిండి.. రెండు రోజుల ముందు డెంగ్యూ జ్వరం ఉన్నట్లు నిర్ధారించుకుని ట్రయల్స్ చేస్తారు. ట్రయల్స్ లో భాగంగా రోగి 8 రోజులు ఆస్పత్రిలో ఉండాలి. ఏడు రోజుల పాటు ఈ మందును రోగికి ఇస్తారు. తర్వాత 17 రోజుల పాటు అతడిని పరిశీలనలో ఉంచుతారు. ఇది విజయవంతమైతే వైద్య శాస్త్రంలో మరో ముందడుగు పడినట్లే..

హ్యూమన్స్ ట్రయల్స్ జరిగే కేంద్రాలు..

దేశంలోని 20 కేంద్రాలలో డెంగ్యూ మెడిసిన ట్రయల్స్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వీటిలో కాన్పూర్, ఆగ్రా, లక్నో, థానే, ముంబై, పుణె, అహ్మదాబాద్, ఔరంగాబాద్, కోల్ కతా, మంగళూరు, బెంగళూరు, బెల్గామ్, చెన్నై, చండీగఢ్, జైపూర్, విశాఖపట్నం, ఖుర్దా, కటక్, నాథ్ నగరాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లోని గణేష్ శంకర్ విద్యార్థి మెమోరియల్ మెడికల్ కాలేజ్, లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ, ఆగ్రాలోని సరోజినీ నాయుడు మెడికల్ కాలేజీలు హ్యూమన్స్ ట్రయల్స్ కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ప్రతి కేంద్రంలో 100 మందిపై ప్రయోగం చేస్తారు. 

 

 

 

Leave a Comment