అమ్మ బాబోయ్.. మెక్ డొనాల్డ్ కూల్ డ్రింక్ లో బల్లి..!

గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లోని మెక్ డొనాల్డ్ రెస్టారెంట్ లో కూల్ డ్రింక్ లో బల్లి ప్రత్యక్షమైంది. రెస్టారెంట్ లో కూల్ డ్రింక్ తాగేందుకు వచ్చిన భార్గవ్ జోషి అనే కస్టమర్ గ్లాస్ లో ఈ బల్లి కనిపించింది. భార్గవ్ జోషి దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయ్యింది. దీంతో రెస్టారెంట్ ని అధికారులు సీజ్ చేశారు. 

భార్గవ్ జోషి అతని స్నేహితులతో శనివారం సోలాలోని మెక్ డొనాల్డ్ అవుట్ లెట్ కి వచ్చాడు. ఈక్రమంలో భార్గవ్ బర్గర్, కూల్ డ్రింక్ ఆర్డర్ చేశాడు. అయితే భార్గవ్ కి ఇచ్చిన కూల్ డ్రింక్ లో బల్లి తేలుతూ కనిపించింది. దీంతో యజమానులకు ఈ విషయాన్ని చెప్పారు. నాలుగు గంటల పాటు కూర్చున్న తమ ఫిర్యాదును ఎవరూ పట్టించుకోలేదని భార్గవ్ జోషి ఆరోపిస్తున్నాడు. అయితే కూల్ డ్రింక్ కోసం చెల్లించిన రూ.300 వాపసు ఇచ్చినట్లు తెలిపారు. 

కోపంతో భార్గవ్ దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ తర్వాత అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అహ్మదాబాద్ మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగారు. పరీక్ష కోసం అవుట్ లెట్ నుంచి కూల్ డ్రింక్ నమూనాలను సేకరించారు. ఆ తర్వాత సోలాలోని మెక్ డొనాల్డ్ అవుట్ లెట్ ని సీల్ చేశారు.  

 

 

Leave a Comment