రిక్షావోడికి ఐటీ శాఖ షాక్.. రూ.3 కోట్లు పన్ను చెల్లించాలని నోటీసులు..!

సాధారణంగా ఇన్ కమ్ ట్యాక్స్ ఎవరికి వేస్తారు..పెద్ద ఇండస్ట్రియలిస్ట్ లేదా బడా వ్యాపారవేత్తకు మాత్రమే కోట్ల రూపాయల పన్నులు కడుతుంటారు.. కానీ రెక్కాడితే కాని డొక్కాడని ఓ సామాన్యుడికి ఏకంగా కోట్ల రూపాయలు పన్ను చెల్లించాలని ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ నోటీసులు ఇచ్చింది. ఐటీ అధికారుల నోటీసులతో షాక్ అయిన ఆ సామాన్యుడు ఏకంగా పోలీసులను ఆశ్రయించాడు.. 

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మథురలోని బకల్ పూర్ ప్రాంతంలోని అమర్ కాలనీలో ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి రిక్షా నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ప్రతాప్ సింగ్ కు ఐటీశాఖ అధికారులు రూ.3 కోట్లు పన్ను చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. దీంతో రిక్షా పుల్లర్ షాక్ అయ్యాడు. తనకు అన్యాయం జరిగిందని, ఆ సమస్య నుంచి తనను గట్టెక్కించాలని హైవే పోలీసులసు ఆశ్రయించాడు. ఐటీ శాఖ అధికారులు తనకు నోటీసులు పంపించారని, అందులో తాను కోట్ల రూపాయలు బాకీ ఉన్నట్లు ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. 

Leave a Comment