కరోనాపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు..!

దేశంలో కరోనా ఉధృతి ఇంకా తగ్గలేదు. రోజు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. అదే సమయంలో వరుసగా పండుగలు వస్తున్నాయి. ఈక్రమంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. పండుగ సీజన్ లో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. 5 శాతం కంటే ఎక్కువ కరోనా కేసులు ఉన్న జిల్లాల్లో ప్రజలు గుంపులుగా గుమిగూడవద్దని, భౌతిక దూరం పాటించాలని, ఆన్ లైన్ షాపింగ్ చేయాలని, ప్రయాణాలు వీలైనంత వరకు మానుకోవాలని సూచించింది. 

మరికొద్ది రోజుల్లో దీపావళి పండుగ కూడా రానుంది. దీంతో కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో మనం ఎండెమిక్ దశకు చేరుకున్నామని భావించడం తగదని స్పష్టం చేశారు. రోగనిరోధక శక్తిని దాటుకుని కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తే భారత్ తో సెకండ్ వేవ్ తరహా వేవ్ ముంచెత్తుతుందని నిపుణులు హెచ్చరించారు. రష్యా, బ్రిటన్ వంటి దేశాల్లో వైరస్ తిరిగి వ్యాప్తి చెంది ఎలా పరిణామాలు సంభవిస్తున్నాయో చూస్తున్నామన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. దేశంలో ఇంకా ఎండెమిక్ దశకు చేరలేదని నిపుణులు వివరించారు.  

Leave a Comment