పదో తరగతి/ఐటీఐ/డిప్లొమా/డిగ్రీ అర్హతతో పోస్టులు

భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగానికి చెందిన బెంగళూరులోని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) యూఆర్ రావు శాటిలైన్ సెంటర్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్ 182 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

పోస్టుల వివరాలు..

 టెక్నీషియన్, డ్రాఫ్ట్స్ మెన్, టెక్నికల్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, సైంటిపిక్ అసిస్టెంట్, హిందీ టైపిస్ట్, కుక్, ఫైర్ మెన్ తదితర విభాగాలున్నాయి. 

విభాగాలు

ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్, ఎలక్ట్రికల్, ప్లంబర్, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రోప్టేటింగ్, మెకానికల్ తదితర విభాగాలు ఉన్నాయి. 

అర్హత 

పోస్టులను బట్టి పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో /సబ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం- రాత పరీక్ష, స్కిల్ టెస్ట్.

దరఖాస్తు విధానం – ఆన్ లైన్

చివరి తేదీ – మార్చి 6, 2020

వెబ్ సైట్ – www.isro.gov.in

Leave a Comment