ఇప్పుడు పరీక్షల కాలం వచ్చేసింది. ఈ సమయంలో విద్యార్థులకు ఎంతో కీలకమైంది. పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థులు ఒక ప్రణాళిక ప్రకారం చదువుకుంటే మంచి మార్కలను పొందగలుగుతారు. ప్రతి రోజూ ఏ సబ్జెక్టు చదవాలి, ఎంత సమయం చదవాలి అని ఒక టైమ్ టేబుల్ వేసుకొని చదువుకుంటే మీరు పరీక్షలలో సక్సెస్ అవడం ఖాయం.
Preparation Tips :
- మొదటగా మీరు పరీక్షల ప్రిపరేషన్ కోసం ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి. ఏ రోజు ఏ సబ్జెక్ట్ చదవాలి, ఏ పాఠాలు చదవాలి, ఏ రోజు ఏమీ పూర్తి చేయాలి అనేది ఒక ప్లాన్ చేసుకోవాలి.
- అలాగే పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు సమయపాలన చాలా ముఖ్యం. సబ్జెక్ట్ ఎంత సేపు చదవాలి. మన టైమ్ టేబుల్ ప్రకారం ఎన్ని ప్రశ్నలు పూర్తి చేయాలి, అనుకుని చదవడం వల్ల సమయం వేస్ట్ కాదు.
- చదివేటప్పుడు మనం కంఠస్థ పద్ధతిలో కాకుండా సబ్జెక్ట్ ను అర్థం చేసుకుంటూ చదవాలి. Conceptని ఒక బొమ్మలాగా మనసులో వేసుకుని ఏ పాయింట్ తర్వాత ఏది వస్తుంది అని వేసుకుంటే బాగా గుర్తుంటుంది.
- పరీక్షల సమయంలో చదువుకోవాలి కదా అని తిండిని, నిద్రను నిర్లక్ష్యం చేయవద్దు. పరీక్షల సమయంలో కూడా కనీసం 6 గంటల పాటు నిద్ర ఉండేట్టు చూసుకోవాలి. నిద్ర మేల్కొని చదివితే తీరా పరీక్షల ముందు ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది.
Download Intermediate Hall tickets :
ఇక మార్చి 5 నుంచి 23 వరకు ఇంటర్మీడియట్ ఫస్టియర్ మరియు సెంకడియర్ పరీక్షలు జరగబోతున్నాయి. పరీక్షలు రాయలంటే ముందుగా మీరు హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్ పరీక్షల హాల్ టికెట్స్ ను ఆన్ లైన్ లో ఏ విధంగా డౌన్ లోడ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
- ముందుగా విద్యార్థులు పరీక్షల హాల్ టికెట్ డౌన్ లోడ్ చేయడానికి bie.ap.gov.in లింక్ ను క్లిక్ చేయాలి.
- మీరు లింక్ పై క్లిక్ చేసిన తరువాత స్క్రీన్ మీద లాగిన్ విండో తెరుచుకుంటుంది.
- ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం విద్యార్థులు హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవడానికి మొదటి సంవత్సరం హాల్ టికెట్ నెంబర్ లేదా ఆధార్ కార్డు నెంబర్, పుట్టిన తేదీ మరియు విద్యార్థి పేరును నమోదు చేయాల్సి ఉంటుంది.
- మొదటి సంవత్సరం విద్యార్థులు హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవడానికి వారి SSC Hall Ticket Number లేదా ఆధార్ నెంబర్, పుట్టిన తేదీ మరియు అభ్యర్థి పేరు నమోదు చేయాలి.
- దీని తరువాత Download Hall Ticket బటన్ పై క్లిక్ చేయాలి.
- ఇప్పుడు, మీ హాల్ టికెట్ లో ఉన్ అన్ని వివరాలను తనిఖీ చేసిన తరువాత Download Hall Ticket పై క్లిక్ చేయండి.
- మీ హాల్ టికెట్ పీడీఎఫ్ లో డౌన్ లోడ్ అవుతుంది.
WEB SITE : https://bie.ap.gov.in/GetTheoryHallTicket.do