Viral Video: ఒక అబ్బాయి కోసం ఇద్దరమ్మాయిలు.. నడి రోడ్డుపై కొట్టుకున్నారు..!

వీళ్లు కాలేజీకి వెళ్లే అమ్మాయిలు.. కాలేజీకి వెళ్లిన వారు బుద్ధిగా చదువుకుని ఇంటికి రావాలి.. కానీ ఇద్దరు అమ్మాయిలు నడి రోడ్డు మీద రచ్చరచ్చ చేశారు. ఒకరి జుట్టు మరొకరు లాక్కొని కొట్టుకున్నారు. వీళ్లకేమైనా గట్టు పంచాయతీలు ఉన్నాయా.. లేదా ఇంట దగ్గర తగాదాలు ఉన్నాయా.. అంటే.. అలాంటివేమీ లేవు.. వీళ్లు కొట్టుకుంది ఒక అబ్బాయి కోసం.. అవును.. నిజమే.. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలోని అన్నానగర్ బస్ట్ స్టాప్ వద్ద జరిగింది.  

వీళ్లిద్దరూ ఒకే కాలేజీ అమ్మాయిలు.. ఇద్దరూ ఒకే అబ్బాయిని ప్రేమించారు. ఆ విషయం ఇద్దరికీ చాలా లేటుగా తెలిసింది. దీంతో ఇద్దరు వాదనకు దిగారు. ఆ అబ్బాయిని నువ్వు మర్చిపో.. కాదు నువ్వు మర్చిపో.. అంటూ గొడవకు దిగారు. ఆ గొడవ కాస్త శృతి మించి రోడ్డు మీద కొట్టుకొనే వరకు వెళ్లింది.. ఈ ఇద్దరు అమ్మాయిలు కొట్టుకుంటుంటే.. అక్కడున్న విద్యార్థులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో అది వైరల్ గా మారింది.    

 

 

Leave a Comment