98 ఏళ్ల వయస్సులో స్కూల్ కి..!

చదువుకోవాలనే కసి..పట్టుదల ఉండాలనే కానీ.. చదువుకు వయస్సుతో పని లేదని నిరూపించింది ఈ మహిళ.. 98 ఏళ్ల వయస్సులో బ్యాగ్ వేసుకుని బడికి వెళ్తోంది. టీచర్లు చెప్పే పాఠాలు శ్రద్ధగా వింటుంది. బ్రేక్ టైమ్ లో పిల్లలతో కలిసి ఆడుతుంది. తన కంటే 90 ఏళ్లు తక్కువ వయస్సు ఉన్న పిల్లలతో కలిసి గబాగబా నోట్స్ రాసుకుంటుంది. ఆమె పేరు ప్రిసిల్లా సిటైనీ.. 

కెన్యాకు చెందిన ప్రిసిల్లాకి 98 ఏళ్లు ఉంటాయి. అక్కడ ఓ మారుమూల గ్రామంలో ఫ్యామిలీతో కలిసి ఉంటుంది. ఆమెకు బాగా చదువుకుని డాక్టర్ కావాలని ఉండేది. కానీ ఆమె చిన్నప్పుడు బడికి వెళ్లే అవకాశం రాలేదు. దీంతో మంత్రసానిగా చేస్తోంది. ఇప్పుడు పుస్తకాలు పట్టి స్కూల్ కి వెళ్తోంది. ఈ అవకాశం ఆమెకు 98 ఏళ్ల వయసులో వచ్చింది. అది ఎలా వచ్చిందంటే.. 

ప్రిసిల్లా మనువరాలికి ఆరోగ్యం బాగాలేదు. దీంతో ఆమె స్కూల్ మానేసింది. మనువరాలి చదువు కోసం స్కూల్ లో ఫీజు కట్టారు. ఆ డబ్బులు అయితే మళ్లీ తిరిగి రావు కదా.. దీంతో ప్రిసిల్లా స్కూల్ కి వెళ్లాలని నిర్ణయించుకుంది. 98 ఏళ్ల వయసులో స్కూల్ కి వెళ్లి చదువుకుంటోంది. మధ్యలో చదువు మానేసిన వాళ్లకు, మనవలు, మనవరాళ్లకు తనను  ఉదాహరణగా తీసుకుని బాగా చదువుకుని మంచి స్థాయిలో ఉండాలనేది తన కోరిక అని ప్రిసిల్లా చెబుతోంది. 

ప్రిసిల్లాను స్కూల్ లో అల్లరి చేసే పిల్లల్ని కంట్రోల్ చేసేందుకు క్లాస్ మానిటర్ గా చేసినట్లు లియోనిడా తలాం అనే టీచర్ చెప్పింది. ఆమె పిల్లలను బాగా కంట్రోల్ చేస్తోందని, తాను బయటికి వెళ్లినప్పుడు క్లాస్ అంతా సైలెంట్ గా ఉంటోందని తెలిపింది. అంతేకాదు 98 ఏళ్ల వయసులో స్కూల్ కి వెళ్తున్న ప్రిసిల్లా జీవితం ఆధారంగా ‘గోగో’ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ కూడా తీశారు. ‘గోగో’ అంటే కెన్యా భాషలో ‘గ్రాండ్ మదర్’ అని అర్థం.. 

 

Leave a Comment