తండ్రికి గుండె నొప్పి ఉంటే.. పిల్లలకు వస్తుందా..!

నేటి కాలంలో ప్రతి ఒక్కరూ ఏదో అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఒత్తిడి, పని టెన్షన్, ఉబకాయం తదితర కారణాలతో గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి. ఈ మధ్య యువతలో కూడా ఎక్కువైంది. 35 ఏళ్ల కంటే తక్కవు వయస్సు ఉన్న వారిలో హార్ట్ ఎటాక్ సమస్య 35 శాతం పెరిగినట్లు సర్వేలు తెలుపుతున్నాయి. ఇప్పుడు కార్డియో వాస్క్యులర్ సమస్య గురించి తెలుసుకుందాం..

సాధారణంగా జీవన విధానం సరిగ్గా లేకపోవడం, ఉబకాయం గుండె సంబంధిత వ్యాధులకు కారణమవుతుంది. అధేవిధంగా వ్యాయామం ఎక్కువ చేసేవారిలోనూ గుండె సంబంధిత సమస్యలు వస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ ఫిట్ నెస్ మీద శ్రద్ధ పెట్టాల్సిన మాట నిజమే. కానీ హెవీ వర్కవుట్స్ చేయడం మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ప్రతి ఒక్కరూ శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి. అధికంగా వ్యాయామం చేయడం వల్ల బ్లడ్ ప్రెజర్ లో ఎక్ట్స్రా ప్రెషర్ వస్తుంది. దీని కారణంగా హైబీపీ, హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు వస్తాయి. ప్రతిరోజూ సరైన పోషక పదార్థాలు తీసుకుంటూ.. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. నెమ్మదిగా వ్యాయామం చేసి ఫిజికల్ కెపాసిటీని పెంచుకోవాలి. అంతేకానీ ఫిట్నెస్ పేరుతో ఇబ్బందులు తెచ్చుకోకూడదు.. 

హార్ట్ ఎటాక్ వంశపార్యం పరంగా వస్తుందా?

హార్ట్ ఎటాక్ అనేది వంశపార్యం పరంగా వస్తుందా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అసలు నిజంగా వంశపార్యంపరంగా హార్ట ఎటావ్ వస్తుందా అనే విషయానికి వస్తే.. ఉదాహరణకు 50 ఏళ్ల వ్యక్తికి హార్ట్ ఎటాక్ వచ్చిందంటే.. వాళ్ల కొడుకుకు కూడా అదే వయసులో హార్ట్ ఎటాక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని కొంత మంది వైద్యులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ వంశపార్యంపరంగా వచ్చే అనారోగ్య సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ముందుగా రాబోయే రిస్క్ గురించి తెలుసుకోవాలి. అంతేకాదు క్రమంతప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కానీ చాలా మంది ఇలా వంశపార్యంపరంగా వచ్చే సమస్యలను గుర్తించరు. హఠాత్తుగా వీటి వల్ల కూడా ముప్పు వచ్చే అవకాశ ఉంది.. అందుకు ముందు నుంచి పరీక్షలు చేయించుకోవడం మంచిది.. అలాగే వ్యాయామాలను కూడా రెగ్యులర్ చేయాలి. శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటూ ఉంటే సమస్యలు రావు.. 

Leave a Comment