ఇర్ఫాన్ ఖాన్ మృతి సినీరంగానికి తీరని లోటు

బాలీవుడ్ విలక్షణ నటుడైన ఇర్పాన్ ఖాన్ మరణం చలన చిత్ర రంగానికి తీరని లోటని  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ది సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తుమ్మా విజయకుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇర్పాన్ ఖాన్ 1988 లో సలాం బాంబే సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టి, అనేక చిత్రాల్లో విలక్షణమైన పాత్రలను పోషించి ప్రేక్షకుల మనన్నలు అతి స్వల్పవ్యవధిలోనే పొందిన గొప్పనటునని ప్రశంసించారు.

తెలుగులో నిర్మించిన  సైనికుడు సినిమాలో తనదైన శైలిలో నటించి తెలుగు ప్రేక్షకుల మనన్నలు పొందిన విలక్షణ నటుడని, ఈ చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమతో ఆయన అవినాభావ సంబంధం ఏర్పర్చుకున్నారని అన్నారు. ఎంతో విలక్షణ నటుడైన ఇర్పాన్ ఖాన్  మృతికి ఎఫ్.డి.సి ఎండి తుమ్మా విజయకుమార్ రెడ్డి ప్రగాడ సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు తమ  సానుభూతి వ్యక్తం చేశారు. 

బాలీవుడ్‌ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ది  చైర్మన్ టి.ఎస్.విజయ్ చందర్ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసారు. ఇర్ఫాన్‌ బాలీవుడ్‌ సినిమాలే కాకుండా స్లమ్‌డాగ్‌ మిలియనీర్, ఎ మైటీ హార్ట్‌, జురాసిక్‌ వరల్డ్‌, లైఫ్‌ ఆఫ్‌ పై వంటి హాలీవుడ్‌ ఉత్తమ చిత్రాల్లోనూ నటించి మంచి పేరును సంపాదించారని ఆయన అన్నారు.

Leave a Comment