విక్రమ్ ‘కోబ్రా’ సినిమాలో ఇర్ఫాన్ పఠాన్ ఫస్ట్ లుక్..!

విక్రమ్ హీరోగా 20కిపైగా విభిన్న పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘కోబ్రా’. ఇందులో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.  కాగా ఇర్ఫాన్ అభిమానులకు ‘కోబ్రా’ దర్శకుడు అజయ్ జ్ఞానముతు సర్ ప్రైజ్ ఇచ్చాడు. అక్టోబర్ 27న ఇర్ఫాన్ పఠాన్ 36వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా దర్శకుడు అజయ్ ‘కోబ్రా’ చిత్రంలో ఇర్ఫాన్ పఠాన్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశాడు. 

ఈ లుక్ లో ఇర్ఫాన్ బ్లాక్ సూట్ ధరించిన స్టయిలిష్ గా కనిపించాడు. ఇందులో ఆయన ఫ్రెంచ్ ఇంటర్ పోల్ ఆపీసర్ అస్లాన్ ఇల్మాజ్ గా కనిపించనున్నట్లు దర్శకుడు అజయ్ వెల్లడించాడు. అయితే క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఇర్ఫాన్ పఠాన్ తనకు నటన అంటే ఇష్టమని పలు ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఈ నేపథ్యంలో అజయ్ దర్శకత్వం వహిస్తున్న ‘కోబ్రా’ చిత్రంలో నటించి కోలీవుడ్ తో తన యాక్టింగ్ కేరీర్ ను ప్రారంభిస్తున్నాడు.  

Leave a Comment