ఆ కోడి ధర లక్ష రూపాయలు..!

ఎక్కడైన కోడి ధర ఎంత ఉంటుంది.. మహా అయితే రూ.1000 లేదా రూ.2 వేలు ఉంటుంది. కానీ గిద్దలూరు మండలంలోని ముండ్లపాడు గ్రామానికి చెందిన రైతు మందగంటి పెద్ద పుల్లయ్య వద్ద ఉన్న ఈ కోడిపుంజు ధర ఏకంగా రూ.లక్ష ఉందట. పెద్ద పుల్లయ్య గత 30 ఏళ్లుగా కోళ్ల పెంపకం చేస్తున్నాడు. అరుదైన కోళ్లను పెంచుతూ కోళ్ల పెంపకంలో తనదైన ముద్ర వేసుకున్నాడు. 

మూడు నెలల క్రితం తమిళనాడులోని పొల్లాచ్చిలో పెద్దపర్ల జాతికి చెందిన ఏడు నెలల వయసున్న కోడిపుంజును కొనుగోలు చేశాడు. ఇది అరుదైన జాతికి చెందిన కోడి పుంజు కావడంతో రూ.లక్షకు కొన్నాడు. అరుదైన జాతి కోళ్లను జల్లెడ పట్టేందుకు అతనికి రూ.24 వేలు ఖర్చయింది. మొత్తం మీద తమిళనాడు నుంచి కోడి పుంజును ఇంటికి తెచ్చేందుకు రూ.1.24 లక్షలు ఖర్చు చేశాడు.

ఇంకా తన వద్ద ఉన్న కోళ్లలో ఒక్కటి కూడా రూ.30 వేలకు తక్కువ ధరలో లేవు. పది రోజుల పిల్ల రూ.5 వేలు, కోడి గుడ్డు రూ.1000 చొప్పున విక్రయిస్తుంటాడు. అరుదైన జాతికి చెందిన కోళ్లకు బలమైన ఆమారం ఇవ్వాలని, ఒక్కో కోడికి రోజుకు రూ.3000 ఖర్చు అవుతుందని రైతు అంటున్నాడు.   

 

Leave a Comment