ఏటీఎం నుంచి విత్ డ్రా పరిమితి పెంపు..!

వినియోగదారులకు దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్తను అందించింది. ఏటీఎంల నుంచి రోజువారి విత్ డ్రా చేసుకునే నగదు పరిమితిని పెంచుతున్నట్లు ప్రకటించింది. ఏడు రకాల డెబిట్ కార్డులపై విత్ డ్రా లిమిట్ ను పెంచుతున్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకు రోజుకు రూ.10 వేల వరకు మాత్రమే గరిష్టంగా ఏటీఎం నుంచి విత్ డ్రా చేసుకునే అవకాశం ఉండేది. 

ఇప్పుడు కార్డును బట్టి రోజుకు రూ.20 వేల నుంచి రూ.లక్ష వరకు డ్రా చేసుకోవచ్చు. వివిధ కార్డులకు ఈ పరిమితి విభిన్నంగా ఉంటుంది. అయితే రూ.10 వేలు అంతకు మించి విత్ డ్రా చేసుకునేటప్పుడు వినియోగదారుడి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. ఇంకా సేవింగ్స్ అకౌంట్ ఖాతాదారులు ఏటీఎంల ద్వారా 8 ట్రాన్సాక్షన్ల వరకు ఉచితంగా చేసుకోవచ్చు. 

డెబిట్ కార్డుల వారీగా రోజువారీ విత్ గ్రా లిమిట్..

  • క్లాసిక్ మరియు మాస్ట్రో డెబిట్ కార్డు – రూ.20వేలు
  • గ్లోబల్ ఇంటర్నెషనల్ డెబిట్ కార్డు – రూ.40 వేలు
  • గోల్డ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు – రూ.50 వేలు
  • ప్లాటినం ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు – రూ.లక్ష
  • ఇన్ టచ్ ట్యాప్ అండ్ గో డెబిట్ కార్డు – రూ.40 వేలు
  • మై కార్డ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు – రూ.40వేలు
  • ముంబై మెట్రో కాంబో కార్డు – రూ.40వేలు

 

Leave a Comment