IRCTC: రూ.20 టీకి.. రూ.50 సర్వీస్ చార్జి.. షాకైన రైల్వే ప్రయాణికుడు..!

ఓ కప్పు టీ ఎంతకు అమ్ముతారు? రూ.10 ఉంటుంది.. కానీ ఓ ప్రయాణికుడు టీకి రూ.70 చెల్లించాడు.. అదెక్కడో కాదు.. మన ఇండియన్ రైల్వేలో.. ఇందులో విశేషం ఏంటంటే.. టీ ఖరీదు రూ.20 మాత్రమే.. దీనికి సర్వీస్ చార్జి రూ.50 చెల్లించాల్సి వచ్చింది. టీ తీసుకొని బిల్లు అందుకున్న ప్రయాణికుడు షాక్ అయ్యాడు.. 50 రూపాయలు సర్వీస్ చార్జి అట.. అతడు ఆ బిల్లును ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో అది వైరల్ గా మారింది. 

వినోద్ వర్మ అనే ప్రయాణికుడు ఢిల్లీ-భోపాల్ మధ్య నడిచే శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైల్లో జూన్ 28న ప్రయాణించాడు. ప్రయాణ సమయంలో అతడు టీ కొనుగోలు చేశాడు. ఆ టీకి అతడు రూ.70 చెల్లించాడు. ఆ బిల్లును ట్విట్టర్ లో పెడుతూ ‘రూ.20 టీకి రూ.50 సర్వీస్ చార్జి.. మరీ ఇంత దోపిడీయా?’ అంటూ ట్వీట్ చేశాడు. 

రైల్వే అధికారులు కూడా దీనిపై వివరణ ఇచ్చారు. తాము అదనంగా ఏమీ వసూలు చేయలేదని తెలిపారు. రాజధాని, శతాబ్ది వంటి రైళ్లలో ముందుగా ఆహారం బుక్ చేయకుండా.. ప్రయాణ సమయంలో బుక్ చేస్తే రూ.50 సర్వీస్ చార్జి చెల్లించాల్సి ఉంటుందని వివరణ ఇచ్చారు. అయితే.. ప్రయాణికుడు చేసిన ట్వీట్ వైరల్ కావడంతో నెటిజన్లు దీనిపై స్పందిస్తున్నారు. 

 

 

Leave a Comment