గాడిదతో ఇంటర్వ్యూ..సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..!

ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రస్తుత కరోనా పరిస్థితుల ఆధారంగా చేసిన ఈ వీడియో నెటిజన్లను వహ్..వహ్ అనిపించుకుంటోంది. ఇంతకు ఈ వీడియోలో ఏముందనుకుంటున్నారా..ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మాస్కు ధరించడం, శానిటైజర్ వాడకం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వాలు మొత్తుకుంటున్నాయి. అయినా ప్రజలు వాటిని పెడచెవిన పెడుతున్నారు. మాస్కులు లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు. 

ఈ క్రమంలో ఓ జర్నలిస్ట్ మాస్కు ప్రాధాన్యతను తెలియజేస్తూ వినూత్న ప్రయత్నం చేశాడు. మాస్క్ ధరించని వారికి బుద్ది చెప్పడం కోసం గాడిదను ఇంటర్వ్యూ చేశాడు. ‘ఇక్కడ ఎందుకు కూర్చున్నావు..మాస్క్ ఎందుకు పెట్టుకోలేదు’ అని అడుగుతాడు. అది గాడిద కదా..సమాధానం చెప్పదు..దీంతో పక్కనే మాస్క్ ధరించకుండా ఉన్న వ్యక్తిని ఆపి అక్కడ ఇద్దరు కూర్చున్నారు..కరోనా వైరస్ సమయంలో మాస్క్ లు లేకుండా తిరుగుతున్నాయని, ఎందుకు మాస్కులు పెట్టుకోలేదని ప్రశ్నించానని గాడిదలను చూపించి అడుతాడు. 

దీనికి ఆ వ్యక్తి ‘అవి గాడిదలు కదా’ అని సమాధానం చెబుతాడు. ఓహో అయితే గాడిదలు కరోనా సమయంలో మాస్క్ పెట్టుకోకుండా తిరుతాయి..అని చెప్తాడు. దీంతో ఆ వ్యక్తికి పూర్తిగా అర్థమవుతుంది..ఆ జర్నలిస్ట్ తనను గాడిదతో పాల్చాడని..ఇలాగే ఆ జర్నలిస్ట్ ఇంటర్య్వూ మరి కొందిరితో సాగుతుంది.. 

 

Leave a Comment