హృదయ విదారక సన్నివేశం.. చనిపోయిన తల్లిని పెనవేసుకుని ఉన్న చిన్నారి వానరం..!

ప్రపంచంలో తల్లి ప్రేమను మించింది లేదంటారు.. తల్లి ప్రేమకు మనుషులు.. జంతువులు అనే తేడా లేదు. అయితే ఇక్కడ ఓ తల్లి వానరాన్ని చిరుత తన నోట్లో పట్టుకుపోతుంటే.. బిడ్డ వానరం మాత్రం అమ్మను కడవరకు వీడలేదు. ఆ అమ్మను గట్టిగా పెనవేసుకుని అలాగే ఉండిపోయింది. ఈ చిత్రం అందరి హృదయాలను కదిలిస్తోంది..

జాంబియాలోని దక్షిణ లుయాంగ్వా నేషనల్ పార్క్ లో ఈ హృదయ విదారక సన్నివేశం చోటుచేసుకుంది. ఈ సన్నివేశాన్ని జాంబియాలోని చిపాటాకు చెందిన వన్యప్రాణి ఫొటో గ్రాఫర్ షఫీక్ ముల్లా తన కమెరాలో బంధించాడు. చిరుత తల్లి కోతిని పట్టుకుని వెళ్తుండగా.. ఆ పిల్ల కోతి మాత్రం తన తల్లిని గట్టిగా పెనవేసుకుని ఉండిపోయింది. చివరికి ఈ పిల్ల కోతిని కూడా చిరుత చంపేసింది..  

Leave a Comment