ఈ పండ్లను కలిపి తింటున్నారా.. అయితే చాలా డేంజర్ అంటా..!

పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి.. పండ్లను రోజువారి ఆహారంలో తప్పకుండా చేర్చుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తుంటారు. ఇక ఏదైన ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు తాజా పండ్లను తినాలని చెబుతారు. పండ్లలో ఖనిజాలు, విటమిన్లు వంటి పోషక పదార్థలు విరివిగా లభిస్తాయి. అయితే కొన్ని పండ్లను కలిపి తీసుకోకూడదని వైద్యులు సూచిస్తారు. అలా తీసుకోవడం ఆరోగ్యానికి ప్రమాదకరమట. ఏఏ పండ్లను కలిపి తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

కలిపి తినకూడదని పండ్లు ఇవే:

బొప్పాయి మరియు నిమ్మ..

బొప్పాయి పండు మరియు నిమ్మకాయలను కలిపి తినకూడదు. ఈ రెండు కలిపి తినడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ హెచ్చు తగులకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. ఇలా తీసుకోవడం వల్ల రక్త హీనత కూడా ఏర్పడవచ్చు. 

ఆరెంజ్ మరియు క్యారెట్..

ఆరెంజ్ మరియు క్యారెట్ కలిపి తనడం కూడా మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఇది మూత్ర పిండ సంబంధిత సమస్యలకు దారితీస్తుందట. ఆరెంజ్, క్యారెట్ కలిపి తినడం వల్ల గుండెల్లో మంట వంటి సమస్యలు కూడా వస్తాయట.. 

జామ మరియు అరటిపండు..

జామ, అరటిపండును కూడా కలిపి తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ రెండు పండ్లను కలిపి తినడం వల్ల పొట్టలో గ్యాస్ సమస్యలు వస్తాయట. అంతేకాదు తలనొప్పి కూడా పెరిగే అవకాశం ఉందట.

దానిమ్మ మరియు నేరేడు..

దానిమ్మ, నేరేడు పండ్లు కూడా కలిపి తీసుకోకూడదట. ఈ రెండు పండ్లలో చక్కెర, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. వీటిని కలిపి తీసుకోవడం వల్ల కడుపులో అసిడిటీ, అజీర్ణం, గుండెల్లో మంట పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఆ పండ్లలో ఉండే అధిక చక్కెర ప్రోటీన్లు జీర్ణం చేసే ఎంజైమ్ లను చంపేస్తాయట..

అరటిపండుతో పాయసం కలపడం వల్ల శరీరంలో టాక్సిన్లు ఉత్పత్తి అవుతాయని వైద్యులు చెబుతున్నారు. దీనిని తీసుకోవడం వల్ల పొట్టలో బరువైన భావన కలుగుతుంది. 

 

Leave a Comment