రంజాన్ పండుగ ప్రార్థనలపై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు..!

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రంజాన్ పండుగ నిర్వహణపై ఆంక్షలు విధించింది. పండుగ ఎలా నిర్వహించుకోవాలనేది సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 14న రంజాన్ పండుగ ఉంది. ఈ సందర్భంగా ఈద్గా, బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించే సామూహిక నమాజ్ ను ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. కరోనా కట్టడికి సామాజిక బాధ్యతగా ముస్లింలు రంజాన్ ప్రార్థనల్ని ఇళ్లలోనే చేసుకోవాలని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా పిలుపునిచ్చారు.  

మార్గదర్శకాలు..

  • రంజాన్ పండుగ రోజున మసీదుల్లో జరిగే ప్రార్థనల్లో 50 మందికి మించి పాల్గొనకూడదు.
  • ప్రార్థనల్లో మాస్క్ ధరించి.. ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాలి. మాస్క్ లేకపోతే ఎవరినీ మసీదుల్లో అనుమతించకూడదు..
  • ప్రార్థనలకు ముందు నిర్వహించే వుజూను ఇళ్ల వద్దే పూర్తి చేసుకోవాలి.
  • కింద కూర్చునేందుకు వీలుగా జానీమాజ్ ఇంటి నుంచే తెచ్చుకోవాలి. 
  • మసీదు ప్రవేశ ద్వారం వద్ద శానిటైజర్ అందుబాటులో ఉంచి ప్రతి ఒక్కరు చేతులు శుభ్రం చేసుకునేలా ఏర్పాట్లు చేయాలి. 
  • వృద్ధులు, పిల్లలతో పాటు దగ్గు, జలుబు, జ్వరం, మధుమేహం, హైబీపీ, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోవాలి. 
  • ఈద్ శుభాకాంక్షలు చెప్పుకునేందుకు చేతులు కలపడం, ఆలింగనం చేసుకోవడం చేయకూడదు..

Leave a Comment