కోవిషీల్డ్ వ్యాక్సిన్ తాజా పరిశోధనలో ఆసక్తికర విషయాలు..!

కరోనా సెకండ్ వేవ్ తో ప్రపంచం అల్లాడిపోయింది. కరోనా ఇప్పుడు కొత్త వేరియంట్లలో రూపాంతరం చెంది ప్రపంచం మొత్తాన్ని దడపుట్టిస్తోంది. అందులో డెల్టా వేరియంట్ తో ప్రపంచం మొత్తం అల్లాడిపోతుంది. అలాంటి వేరియంట్ ను సైతం కోవిషీల్డ్ వ్యాక్సిన్ అడ్డుకుంటుందని ఓ పరిశోధనలో వెల్లడైంది. ఇంగ్లండ్ లో ఇటీవల థర్డ్ వేవ్ మొదలైన సంగతి తెలిసిందే.. అయితే వ్యాక్సిన్ వేసుకోని వారిలో డెల్టా వేరియంట్ ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

12 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసున్న వారిలో డెల్టా వేరియంట్ ప్రభావం చూపినట్లు బ్రిటన్ లో జరిగిన ఓ సర్వేలో వెల్లడైంది. దీంతో డెల్టా వేరియంట్ ను అడ్డుకునేందుకు ప్రత్యేకంగా వ్యాక్సిన్ తయారు చేయాల్సిన అవసరముందని పరిశోధకులు తెలిపారు. ఎందుకంటే వ్యాక్సిన్ వల్ల ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు కరోనా వైరస్ స్పైక్ ప్రోటీన్లను నియంత్రించలేకపోతున్నాయని చెప్పారు. జూన్ 24 నుంచి జూలై 12 మధ్య రియాక్ట్-1 పేరుతో సర్వే చేశారు. ఆ సమయంలో యూకేలో ఇన్ఫెక్షన్లు భారీ స్థాయిలో పెరిగాయి. ప్రస్తుతం ఇంగ్లండ్ లో డెల్టావేరియంట్ దూకుడు పెంచింది. దీంతో పాజిటివ్ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. 

న్యూట్రలైజేషన్ ఆఫ్ డెల్టావేరియంట్ విత్ సెరా ఆఫ్ కోవీషీల్డ్ వ్యాక్సిన్ అనే అంశంపై ఇంగ్లండ్ పరిశోధకులు ఓ ప్రత్యేక స్టడీ చేసి నివేదిక రూపొందించారు. ఈ నివేదిక ప్రకారం ఇండియాలో తయారవుతున్న కోవిషీల్డ్ టీకా ఒక్కటి మాత్రమే డెల్టా వేరియంట్ ను కొంత మేర అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒక డోస్ లేదా రెండు డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో డెల్టా వేరియంట్ ని నిర్వీర్యం చేసే సామర్థ్యం ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. 

Leave a Comment