ఏపీలో 17 పంచాయతీలకు జాతీయ అవార్డులు..!

జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సం సందర్భంగా కేంద్రం ప్రకటించే అవార్డులలో ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకంగా 17 అవార్డులు దక్కాయి. పంచాయతీ రాజ్ దినోత్సం సందర్భంగా ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం ఈ అవార్డులను ప్రకటించారు. అవార్డుల పోటీలో దేశవ్యాప్తంగా 74 వేల గ్రామ పంచాయతీలు పోటీ పడగా ఏపీకీ 17 అవార్డులు వచ్చాయి. దేశంలో ఎక్కువ అవార్డులు వచ్చిన నాలుగో రాష్ట్రంగా ఏపీ నిలిచింది. గుంటూరు, కృష్ణా జిల్లా పరిషత్ లకు అవార్డులు వచ్చాయి. ఈ-గవర్నెన్స్ కింద ఆంధ్రప్రదేశ్ కు అవార్డు వచ్చింది. 

స్థానిక సంస్థలకు అధికారులు ఇచ్చిన 73వ రాజ్యాంగ సవరణ అమలులోకి వచ్చిన ఏప్రిల 24న జాతీయ పంజాయతీ దినోత్సవంగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగాన్ని పురస్కరించుకుని బాగా పనిచేసిన పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు నాలుగు కేటగిరిలలో కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ జాతీయ స్థాయిలో అవార్డులు ప్రదానం చేస్తుంది. ఈ మేరకు గత ఏడాది రాష్ట్రానికి 15 అవార్డు రాగా, ఈసారి మొత్తం 17 అవార్డులు వచ్చాయి. 

ఈ ఏడాది ఈ-పంచాయత్ కేటగిరీలో రాష్ట్రస్థాయి రెండో అవార్డుతో పాటు, జిల్లా స్థాయిలో 2, మండల స్థాయిలో 4, పంచాయతీ స్థాయిలో 10 జాతీయ అవార్డులు దక్కాయి. జిల్లా స్థాయి అవార్డు కింద రూ.50 వేలు, మండల స్థాయి అవార్డు కింద రూ.25 వేలు, పంచాయతీ స్థాయిలో జనాభాను బట్టి రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు నగదు బహుమతి ఇస్తారు. 

 

Leave a Comment