ఆనందయ్య మందులో పదార్థాలు శాస్త్రీయమైనవే : ల్యాబ్ రిపోర్ట్

కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది.. ఈనేపథ్యంలో ఇప్పుడు అందరి చూపు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వైపు నెలకొంది. సీరియస్ కండిషన్ లో ఉన్న కరోనా రోగులు సైతం ఈ మందుతో కోలుకుంటున్న పరిస్థితి ఉండటంతో జనం ఒకసారిగా పోటెత్తారు.

కృష్ణపట్నంలో ఆనందయ్య అందించే మందుపై శాస్త్రీయపై సందేహాలు నెలకొనడంతో వైద్య బృందాలు రంగంలోకి దిగాయి. ఏపీ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయి అధ్యయనం తర్వాతే అనుమితి ఇస్తామంటోంది..

ఈనేపథ్యంలో ముందుగా ఆయుష్ వైద్య బృందం అధ్యయనం ప్రారంభించింది. కృష్ణపట్నం పట్టణంలో చాలా మందితో మాట్లాడిన తర్వాత ఆనందయ్య మందుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేవని ప్రాథమికంగా తేల్చింది. అనంతరం మందులో వాడే పదార్ధాలు, తయారీలోని శాస్త్రీయతప నిగ్గు తేల్చేందుకు అధ్యయనం కొనసాగిస్తోంది.. ఆయుష్ కమిషనర్ రాములు ఆధ్వర్యంలో ఈ పరిశోధన జరుగుతోంది.. 

పదార్థాలన్నీ శాస్త్రీయమైనవే..

ఆనందయ్య మందు తయారీలో వాడే పదార్థాలన్నీ శాస్త్రీయంగానే ఉన్నాయని, మందు తయారీ పదార్థాలపై ల్యాబ్ నుంచి పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని ఆయుష్ కమిషనర్ రాములు వెల్లడించారు. ఆనందయ్య మందును ఎలా తయారు చేస్తారో పరిశీలిస్తామని రాములు పేర్కొన్నారు. మందును తీసుకున్నవారి అభిప్రాయాలను సేకరిస్తామన్నారు. ఐసీఎంఆర్ బృందం పరిశీలన తర్వాత వారితో కూడా కోఆర్డినేట్ చేసుకుంటామని తెలిపారు. మందు తయారీ అధ్యయనం తర్వాత నివేదికకు వారం పైనే పడుతుందని రాములు వెల్లడించారు. 

నివిదిక వచ్చే వరకు కృష్ణపట్నం రావొద్దు..

ఆనందయ్య ఆయుర్వేద మందుపై ఐసీఎంఆర్, ఆయుష్ బృందాలు అధ్యయనం చేస్తున్నాయని జేసీ హరేంద్రప్రసాద్ తెలిపారు. నివేదిక వచ్చేందుకు వారం, 10 రోజులు పట్టవచ్చని, ప్రభుత్వ అనుమతి వచ్చిన తర్వాతే మందు పంపిణీ చేపడతామని ఆయన వివరించారు. అప్పటి వరకు ప్రజలెవరూ కృష్ణపట్నం రావద్దని జేసీ స్పష్టం చేశారు..

Leave a Comment