ఆవుల్లో భయంకరమైన వ్యాధి.. సోకిన కొద్ది సేపటికే చనిపోతున్నాయి..!

రాజస్థాన్ లో ఆవులకు వింత వ్యాధి వ్యాపించడం కలకలం సృష్టించింది. ఈ వ్యాధి కారణంలో లోహావత్ పల్లి గ్రామంలోని గత రెండు మూడు రోజుల్లో సుమారు 40 ఆవులు అంటు వ్యాధి కారణంగా చనిపోయాయి. దీంతో పశు యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఆవులలో ఇన్ఫెక్షన్ సోకిన అరగంటలో చనిపోతున్నాయి. ఆవులకు వ్యాపించే ఈ వ్యాధితో పశుపోషకులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఈ ఇన్ఫెక్షన్ ఆవులలో అకస్మాత్తుగా వ్యాపిస్తోంది. ఆవు శరీరమంతా గడ్డలు, గడ్డలుగా ఏర్పడుతున్నాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే అవి చనిపోతున్నాయి. అదే సమయంలో చాలా ఆవులలో ఈ వ్యాధి కారణంగా.. పుట్టబోయే ఆవు దూడలు కూడా కడుపులోనే చనిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

అదే సమయంలో పల్లి గ్రామంలో 3 రోజుల్లో 40కి పైగా ఆవులు మృతి చెందినట్లు సమాచారం అందడంతో జోధ్ పూర్ పశుసంవర్ధక శాఖ అధికారులు రంగంలోకి దిగారు. వ్యాధికి గురైన 28 ఆవులకు చికిత్స అందించిన తర్వాత శాంపిల్స్ కూడా తీసుకున్నారు. ఈ వింత వ్యాధి గురించి ఆరా తీస్తున్నారు. 

ఆవులలో వ్యాపించే ఈ వ్యాధి పట్ల గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని పశువైద్యుడు డాక్టర్ సంజయ్ సింగ్ కోరారు. అంటు వ్యాధి కారణంగా, మరింత జాగ్రత్త వహించాలని, అనారోగ్యంతో ఉన్న జంతువు నుండి ఇతర జంతువులను వేరుగా ఉంచాలని ఆయన అన్నారు. చనిపోయిన ఆవులను సురక్షితంగా పాతిపెట్టాలని పశువుల యజమానులను వైద్యులు కోరారు. 

 

Leave a Comment