కరెక్ట్ గా డ్యూటీ చేస్తే.. ఉద్యోగం నుంచి తొలగించారు..!

కరెక్ట్ గా డ్యూటీ చేసినందుకు ఓ పారిశుధ్య కార్మికుడిని ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. అసలేం జరిగిందంటే.. మధురలోని గెనెరల్ గంజ్ లో రోడ్డుపై ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫొటోలు పడి ఉన్నాయి. చెత్తను సేకరించే కార్మికుడు ఆ ఫొటోలను తీసి చెత్త బండిలో వేసుకుని వెళ్లిపోయాడు.. 

చెత్త బండిలో యోగి ఫొటో చూసిన స్థానికులు దీన్ని వీడియో తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని ఆ కార్మికుడిని అధికారులు ఉద్యోగంలో నుంచి తీసేశారు. బాబీ అనే ఒప్పంద పారిశుధ్య కార్మికుడు నిర్లక్ష్యంగా ఉన్న కారణంగా అతడిని వెంటనే విధుల్లో నుంచి తొలగిస్తున్నట్లు అడిషనల్ మున్సిపల్ కమిషనర్ వెల్లడించారు. 

అయితే ఈ వ్యవహారంలో తన తప్పు లేదని పారిశుధ్య కార్మికుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ ఫొటోలు రోడ్డుపైన పడి ఉంటే అది తన తప్పు ఎలా అవుతుందని వాపోయాడు. తనను ఉద్యోగంలో నుంచి తీసే ముందు అసలేం జరిగిందో విచారించాలని, అది నిజంగా తన తప్పు అయితే అప్పుడు నిర్ణయం తీసుకోవాలని ఆ కార్మికుడు అసహనం వ్యక్తం చేశాడు. 

Leave a Comment