కరోనా లాక్‌ డౌన్‌ పై కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ.. వాటికి మినహాయింపు.. 

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం ప్రకటించిన లాక్ డౌన్ కారణంగా లక్షలాది మంది ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నారు. ఈ సమస్యను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గ దర్శకాలు జారీ చేసింది. ఏప్రిల్ 20 తర్వాత గ్రామీణ ప్రాంతాల్లోని కొన్నింటికి మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్రం బుధవారం తెలిపింది. 

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశ వ్యాప్తంగా లక్ డౌన్ ను మే 3 వరకు పొడిగించారు. అయితే ఏప్రిల్ 20 తర్వాత కొన్ని ప్రాంతాల్లో ఆంక్షల్లో సడలింపు ఉంటుందని ప్రకటించారు. ఆ నేపథ్యంలో వ్యవసాయ కార్యకలాపాలు, గ్రామీన ప్రాంతాల్లో రోడ్లు మరియు భవన నిర్మాణం, ఐటీ, ఈ కామర్స్ మరియు అన్ని అంతర్ రాష్ట్ర వస్తువుల రవాణాను ప్రభుత్వం అనుమతిస్తుంది. అయితే కఠినమైన సామాజిక దూర నిబంధనలతో ఇవి అనుమతించబడతాయి. 

అయితే హాట్ స్పాట్లు, అధిక సంఖ్యలో Covid-19 కేసులు ఉన్న ప్రాంతాల్లో లేదా వైరస్ సంక్రమణ వేగంగా పెరుగుతున్న ప్రాంతాల్లో సడలింపు ఉండదని ప్రకటించింది.  

కొత్త మార్గదర్శకాలు ఇవే..

  • గ్రామీణ ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెసింగ్, తయారీ యూనిట్ల  పరిశ్రమలకు లాక్‌ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది. అలాగే గ్రామాల్లో భవన, ఇళ్ల నిర్మాణ రంగ కార్యకాలపాలు నిర్వహించుకోవచ్చు.  
  • అలాగే. మున్సిపల్ పట్టణ ప్రాంతాల్లో కార్మికులు. నిర్మాణ భవనం దగ్గరే ఉండేటట్లైతే. అక్కడ నిర్మాణాలు జరుపు కోవచ్చు. 
  • నిత్యవసర వస్తువులు అంటే మందులు, ఫార్మా ఉత్పత్తులు చేపట్టవచ్చు. గ్రామ ప్రాంతాల్లో అన్ని పరిశ్రమలనూ తెరచుకోవచ్చు. సినిమా హాళ్లు, మాల్స్, షాపింగ్ కాంప్లెక్సులు, జిమ్‌లు, స్పోర్ట్స్ కాంప్లెక్సులు, స్విమ్మింగ్ పూల్స్, బార్లు, మాత్రం.. మే 3 వరకూ తెరవకూడదని కేంద్రం స్పష్టం చేసింది. 
  • రాష్ట్రాల మధ్య, అలాగే జిల్లాల మధ్య ప్రజల ప్రయాణాలు, రాకపోక లపై కేంద్రం మే 3 వరకూ నిషేధం విధించింది. 
  • అలాగే.. మెట్రో రైళ్లు, బస్సు సర్వీసులు కూడా మే 3 వరకూ లాక్‌ డౌన్‌ లోనే ఉంటాయి. 
  • లాక్‌ డౌన్ అమల్లో ఉన్నప్పుడు దేశ వ్యాప్తంగా ప్రజలు ముఖానికి మాస్క్ ధరించడాన్ని కేంద్రం తప్పని సరి చేసింది. బయటకు వచ్చినప్పుడు, పని ప్రదేశాల్లో ఉన్నప్పుడు తప్పని సరిగా మాస్క్ ధరించాలి. 
  • అలాగే ఆరు బయట ఉమ్మి వేయడం ఇకపై చట్ట ప్రకారం నేరం. దానికి జరిమానా విధిస్తారు. సామాజిక, రాజకీయ, క్రీడా, మత పరమైన కార్యక్రమాలు, వేడుకలు, ఫంక్షన్లు నిర్వహించ కూడదు. అన్ని ప్రార్థనా స్థలాలూ మే 3 వరకూ క్లోజ్ చేసి ఉంటాయి. 
  • విద్యా సంస్థలు, ట్రైనింగ్, కోచింగ్ కేంద్రాలు మే 3 వరకూ తెరవ కూడదు. 
  • అంత్యక్రియల కార్యక్రమాల్లో 20 మందికి మించి పాల్గొన కూడదు.అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలూ లాక్‌ డౌన్ నిబంధనల్ని కఠినంగా అమలు చేయాలని కేంద్రం ఆదేశించింది. 
  • అవసరమైతే రాష్ట్రాలు స్థానికంగా అవసరాన్ని బట్టీ ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవచ్చని తెలిపింది. 
  • ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్స్, క్లినిక్స్, టెలి మెడిసిన్ సర్వీసులు రోజూ పని చేస్తాయి. అలాగే.. డిస్పెన్సరీస్, కెమిస్ట్స్, ఫార్మసీస్, అన్ని రకాల మందుల షాపులు, జన ఔషధి కేంద్రాలు తెరిచే ఉంటాయి. 
  • మెడికల్ ల్యాబ్స్, వైద్య ఉత్పత్తుల కలెక్షన్ కేంద్రాలు తెరిచే ఉంచ వచ్చని కేంద్రం తన మార్గ దర్శకాల్లో తెలిపింది. 
  • సేవల రంగానికి మరియు జాతీయ వృద్ధికి డిజిటల్ ఎకానమీ కీకలం అని ప్రభుత్వం తెలిపింది. కాబట్టి ఈ-కామర్స్, ఐటీ మరియు ఐటీ-ఎనేబుల్డ్ సర్వీసెస్, ప్రభుత్వ కార్యకలాపాల కోసం డేటా మరియు కాల్ సెంటర్లు మరియు ఆన్ లైన్ బోధన మరియు దూరవిద్య అనుమతించబడతాయి. 

 

Leave a Comment