ప్రపంచం కరోనాతో పాటు మరో అంటువ్యాధిని ఎదుర్కొంటోంది..!

‘రెండో ప్రపంచ యుద్ధం తరువాత అత్యంత ఘోరమైన Covid-19 మహమ్మారితో ప్రపంచం పోరాడుతోంది. అయితే ప్రస్తుతం ప్రపంచం మరో అంటువ్యాధిని ఎదుర్కొంటుంది. అదే తప్పుడు సమాచారం యొక్క ప్రమాదకరమైన అంటువ్యాధి’ అని ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనీయో గుటెర్రెస్ వ్యాఖ్యానించారు. 

WhatsApp వంటి పలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో Covid-19 గురించి అబద్దాలను విస్తరిస్తున్నాయని చెప్పారు. ఇలాంటి తప్పుడు సమాచారాలను ఎదుర్కోవడానికి వాస్తవాలను విస్తరించే ప్రయత్నం చేయాలని UN చీఫ్ ప్రకటించారు. 

కరోనా వైరస్ గురించి సోషల్ మీడియాలో హానికరమైన ఆరోగ్య సలహాలను వ్యాప్తి చేస్తున్నారని UN సెక్రటరీ జనగర్ చెప్పారు. ‘అబద్దాలు గాలిల విస్తరిస్తున్నాయి.. ద్వేషం వైరల్ అవుతోంది..ఇవి ప్రజలను ప్రమాదంలో నెట్టేస్తున్నాయి.. ఇలాంటి వ్యాధికి వ్యతిరేకంగా ప్రపంచం కూడా ఐక్యంగా ఉండాలని’ ఆయన అన్నారు. 

తమ దేశాల్లో వైరల్ అవుతున్న అబద్దాలు, విద్వేషాలను రెచ్చగొట్టే సమాచారాలను అరికట్టాలని ఆయన వివిధ దేశాలను కోరారు. 

వాట్సాప్ గ్రూపులు మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో కరోనా మహమ్మారి గురించి తప్పుడు సమాచారం వ్యాపించిందని సెక్రటరీ జనరల్ ప్రతినిధి డుజారిక్ అన్నారు. కరోనాకు చికిత్సలు అంటూ వైరల్ చేస్తున్నాయని, ఇవి ప్రపంచానిక చాలా హానికరమని అన్నారు.

ఐక్యరాజ్య సమితి సోషల్ మీడియా సంస్థలతో తప్పుడు సమాచారాన్ని తొలగించడానికి సంప్రదింపులు జరుపుతుందన్నారు. వారు కూడా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారి ఖాతాలను నిలిపివేస్తున్నారని చెప్పిట్లు తెలిపారు. 

అయితే ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ ఉందని, వారి స్వేచ్ఛకు ఆటంకం కలిగించకుండా దీనిని నివారించాలన్నారు. వార్తా సంస్థలకు, సోషల్ మీడియా సంస్థలకు తప్పుడు సమాచారం వ్యాప్తి చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. 

 

Leave a Comment