ఇదేం వింత.. గాలి ద్వారా గర్భం.. కేవలం గంటలోనే ప్రసవం..!

ప్రస్తుతం మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. సాధారణంగా గర్భం దాల్చాలంటే పురుషుడితో కలయిక అవసరం. పురుషుడితో కలయిక లేకుండా గర్భం దాల్చడం అనేది అసంభవం.. అలాంటిది ఇండినేషియాకు చెందిన ఓ మహిళ తాను గాలి ద్వారా గర్భం దాల్చినట్లు చెబుతోంది. ఈ వార్త అందిరినీ ఆశ్యర్యానికి గురిచేస్తోంది.

పశ్చిమ జావాలోని సియాంజూర్ పట్టణానికి చెందిన జైనా అనే 25 ఏళ్ల మహిళ ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ మహిళ తాను గాలి ద్వారా గర్భం దాల్చానని, కేవలం గంటలోనే ప్రసవం జరిగిందని వింతగా వాదిస్తోంది. మధ్యాహ్నం ప్రార్థన చేసుకున్న తర్వాత పడుకున్న సమయంలో తన యోనిలోకి గాలి ప్రవేశించిందని చెబుతోంది.

గదిలో గాలి వీచిన 15 నిమిషాలకు కడుపులో నొప్పిగా అనిపించిందని, కొద్ది సేపటి తర్వాత పొత్తి కడుపు పెద్దగా మారిందని పేర్కొంది. ఆమె నిజంగా గర్భం దాల్చడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. శిశువు, తల్లి ఆరోగ్యంగా ఉన్నారని, అయితే గాలి ద్వారా గర్భం అనేది నమ్మశక్యంగా లేదని వైద్యులు చెబుతున్నారు. ప్రసవించే వరకు మహిళకు తాను గర్భవతి అనే విసయం తెలియకపోవచ్చని అంటున్నారు. 

గాలి ద్వారా గర్భం అంటూ ఆమె చెబుతున్నది కట్టుకథ అని వైద్యాధికారులు భావిస్తున్నారు. కొంత మంది మహిళలకు క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ వస్తుందని, తాము గర్భం దాల్చినట్లు కూడా వారికి తెలియదని ప్రముఖ వైద్యులు ఏమాన్ సులేమాన్ అంటున్నారు. ఈ వింత వార్త వైరల్ కావడంతో ఆమెకు పుట్టిన బిడ్డను చూసేందుకు అధికారులతో పాటు జనాలు క్యూకట్టారు. నిజనిర్ధారణ చేసుకునేందు పోలీసులు కూడా రంగంలోకి దిగారు. జైనాకు భర్త, కుమారుడు ఉన్నారని, నాలుగు నెలల క్రితమే భర్తతో విడాకులు తీసుకున్నట్లు తెలిసింది. 

 

  

Leave a Comment