మోరిస్ రికార్డు వేలం.. యువరాజ్ రికార్డు బ్రేక్..!

ఐపీఎల్ 2021 వేలంలో సౌతాఫ్రికా ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ రికార్డు ధరకు అమ్ముడుపోయాడు. రూ.16.25 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. ఈ వేలంతో మోరిస్ యువరాజ్ సింగ్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇప్పటి వరకు ఐపీఎల్ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా 16 కోట్లతో యువరాజ్ మొదటి స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా ఆటగాడు కమిన్స్ 15.50 కోట్లతో రెండో స్థానంలో ఉండేవాడు. 

కానీ ఈ వేలంతో యువరాజ్ పేరిట ఉన్న ఈ రికార్డును మోరిస్ సొంతం చేసుకున్నాడు. 75 లక్షల బేస్ ప్రైస్ తో వచ్చిన మోరిస్ కోసం పంజాబ్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ పోటీ పడ్డాయి. చివరకూ రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. ముంబై ఇండియన్స్ రూ.12.50 కోట్ల వరకు వెళ్లగా, పంజాబ్ కింగ్స్ రూ.14 కోట్ల వరకు బిడ్ వేసింది.  ఈక్రమంలో రాజస్థాన్ మోరిస్ ను రూ.16.25 కోట్లకు చేజిక్కించుకుంది. దీంతో ఐపీఎల్ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా మోరిస్ మొదటి స్థానంలో ఉన్నాడు.  

  • ఇక ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మాక్స్ వెల్ మళ్లీ జాక్ పాట్ కొట్టేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతడిని రూ.14.25 కోట్లకు కొనుగోలు చేసింది.
  • ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జై రిచర్డ్ సన్ ను రూ.14 కోట్లకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. రిచర్డ్ సంన్ కనీస దర రూ.1.50 కోట్లు ఉండగా అతని కోసం తీవ్ర మైన పోటీ ఏర్పడింది. 
  • ఇక తమిళనాడు ఫినిషర్ షారుఖ్ ఖాన్ కోట్లు కొట్టేశాడు. రూ.20 లక్షల కనీస ధరలో ఉన్న అతడిని పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ.5.25 కోట్లు పెట్టి సొంతం చేసుకుంది. 
  • ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీని రూ.7 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది.  

Leave a Comment