సిరాజ్ పట్ల గర్వంగా ఉంది : సచిన్

చెన్నైలో ఇంగ్లండ్ తో జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో అశ్విన్ అద్బుత సెంచరీ కొట్టిన విషయం తెలిసిందే.. ఆ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. కాగా అశ్విన్ సెంచరీ పూర్తి కాగానే హెల్మెట్ తీసి అభిమానులకు ధన్యవాదాలు చెబుతూ సెలబ్రేట్ చేసుకున్నాడు. 

ఆ సమయంలో నాన్ స్ట్రయికర్ గా ఉన్న సిరాజ్ సైతం సంబరాలు చేసుకున్నాడు. గాల్లోకి పంచ్ లు విసురుతూ అంతే ఆనందంతో ఉప్పొంగిపోయాడు. సిరాజ్ చేసుకున్న సంబరాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అశ్విన్ కన్నా ఎక్కువగా సిరాజ్ సంతోషపడ్డాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

తాజాగా ఈ విషయంపై టీమిండియా మాజీ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ స్పందించారు. సిరాజ్ చేసిన పనికి అభినందించారు. అశ్విన్ సెంచరీ పట్ల సిరాజ్ స్పందన చాలా ఆసక్తికరంగా అనిపించిందని, ఆ క్షణాన్ని తానేంతగానో ఆస్వాదించానని తెలిపారు. క్రీడా స్ఫూర్తి అంటే ఇదనని, సహచరుల విజయాన్ని ఎంజాయ్ చేయడం అందులో ఓ భాగమని పేర్కొన్నారు. టీమిండియా, సిరాజ్ ను చూసి గర్వంగా ఉందని సచిన్ తెలిపారు. ఇక అశ్విన్ కూడా సిరాజ్ ను ప్రశంసించాడు. మంచి టీం మ్యాన్ అంటూ అతడిపై ప్రేమను కురిపించాడు.  

Leave a Comment