73 రోజుల్లో మనకు వ్యాక్సిన్..!

కరోనాకు వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్న భారతదేశానికి సీరం ఇన్ స్టిట్యూట్ ఆప్ ఇండియా గుడ్ న్యూస్ అందించింది. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనికా ఫార్మా కంపెనీ అభివృద్ధి చేస్తున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ 73 రోజుల్లో అందుబాటులోకి తీసుకురాన్నట్లు సీరం ఇన్ స్టిట్యూట్ ఉన్నతాధికారి శనివారం వెల్లడించారు. ప్రస్తుతం సీరం ఇన్ స్టిట్యూట్ ఈ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ నిర్వహిస్తోంది. 

మామూలుగా వ్యాక్సిన్ తయారీకీ ఏళ్లు పడతాయి. కానీ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను ఫాస్ట్ ట్రాక్ విధానంలో ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. 58 రోజుల్లో మూడో దశ ట్రయల్స్ పూర్తి అవుతాయి. మూడో దశలో రెండు సార్లు డోసులు ఇస్తారు. శనివారం ఒక డోస్ ఇచ్చారు. రెండో డోస్ 29 రోజుల తర్వాత ఇస్తారు. అప్పుడు ఆ ట్రయల్స్ సక్సెస్ అయితే 15 రోజుల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది. వ్యాక్సిన్ ఉత్పత్తి అయిన రోజ ఇండియాలో వ్యాక్సిన్ అమ్మకాలు మొదలవుతాయని అంచనా..ఇక మనం రోజులు లెక్కబెట్టుకోవాల్సిందే..ఇప్పటికే ఒక రోజు అయిపోయింది. కాబట్టి ఇక 72 రోజులు ఉన్నాయి.

మూడో దశ ట్రయల్స్ ఇండియాలోని 20 కేంద్రాల్లో ప్రారంభమయ్యాయి. గుజరాత్, మహారాష్ట్ర, అహ్మదాబాద్ తోపాటు పూణే మరియు ముంబైలో ట్రయల్స్ జరుగుతున్నాయి. శనివారం 1600 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. సీరం ఇన్ స్టిట్యూట్ భారత దేశం మరియు 92 ఇతర దేశాలలో ప్రత్యేకంగా వ్యాక్సిన్ విక్రయించడానికి హక్కులు పొందేందుకు రాయల్టీ రుసుం చెల్లిస్తామని ఒప్పందం కుదుర్చుకుంది.  

ఇంకో విషయం ఏంటంటే భారతీయులకు వ్యాక్సిన్ ను ఉచితంగా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకు అయ్యే ఖర్చును తాము చెల్లిస్తామని సంకేతాలు పంపింది. వచ్చే ఏడాది జులై నాటికి 68 కోట్ల డోసులను తయారు చేసి ఇవ్వాల్సిందిగా సీరం సంస్థను కేంద్రం కోరుతోంది. ఇక ఐసీఎంఆర్ మరియు భారత్ బయోటెక్ సంస్థ తయారు చేస్తున్న కోవాల్సిన్ మొదటి, రెండో దశ ట్రయల్స్ లో ఉన్నాయి. ఇవి రావడానికి మరి కొంత కాలం పట్టే అవకాశం ఉంది. 

 

Leave a Comment