మెగాస్టార్ ‘ఆచార్య’ ఫస్ట్ లుక్ వచ్చేసింది..!

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆయన 152వ సినిమా ఫస్ట్ లుక్ ను వచ్చేసింది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ‘ఆచార్య’ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ పతాకాలపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇందులో రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. హీరోయిన్ గా కాజల్ నటిస్తుండగా..మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ మోషన్ పోస్టర్ లో చిరంజీవి ధర్మస్థలి అనే ప్రాంతంలో దుండగులను అంతం చేసి వీరుడిలా కత్తిపట్టుకుని నిలబడి ఉన్నారు. ఈ చిత్రాన్ని 2021 వేసవిలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. 

 

Leave a Comment