సోషల్ మీడియాలో వచ్చిందంటే.. నిజమని నమ్మేస్తున్న భారతీయులు..!

కాలం మారింది.. ఒకప్పుడు పేపర్.. ఆ తర్వాత టీవీ న్యూస్.. ఇప్పుడు సోషల్ మీడియా.. సోషల్ మీడియాలో వచ్చే వార్తలనే ప్రజలు ఎక్కువగా నమ్ముతున్నారు. ముఖ్యంగా ఇండియాలో ఆ సంఖ్య అధికంగా ఉన్నట్లు ‘ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ  ప్రెస్’ సర్వేలో తేలింది. భారత్ లో ఏదైనా సమాచారం తెలుసుకోవాల్సి వస్తే.. సోషల్ మీడియాను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారట.. 

భారత్ మెక్సికో, సౌతాఫ్రికా, అమెరికా, యూకేలలో సర్వే నిర్వహించగా.. భారతదేశంలో 54 శాతం మంది ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లనే ఆశ్రయిస్తున్నారని సర్వేలో తేలింది..ఇక మెక్సికో, సౌతాఫ్రికాలో 43 శాతం, బ్రిటన్ లో మాత్రం కేవలం 16 శాతం మాత్రమే ఉన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే సోషల్ మీడియాలో తాము చదివిన, పంచుకున్న సమాచారం నిజమేనని 87 శాతం మంది భారతీయులు నమ్ముతున్నట్లు సర్వేలో తెలిసింది.  

సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం, తప్పుడు క్లెయిమ్స్ గురించి ఆందోళన ఉన్నప్పటికీ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సోషల్ మీడియా వినియోగదారులు ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ వంటి ప్లాట్ పారమ్ లలో చదివిన, షేర్ చేసే సమాచారం నిజమైందని నమ్ముతున్నారు. యూకే, యూఎస్, సౌతాఫ్రికా, భారతదేశం మరియు మెక్సికో అంతటా 5 వేల మంది వ్యక్తుల నుంచి సేకరించిన డేటా ఆధారంగా సంస్థ ఈ ఫలితాలు వెల్లడించింది.   

Leave a Comment