భారత క్రికెట్ కు యువ క్రికెటర్ రిటైర్మెంట్..!

భారత యువ క్రికెటర్ ఉన్ముక్త్ చంద్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 28 ఏళ్లకే భారత్ క్రికెట్ కు అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. విదేశీ లీగుల్లో ఆడేందుకే భారత్ క్రికెట్ నుంచి తప్పుకుటున్నట్లు ఉన్ముక్త్ స్పష్టం చేశాడు. ఈమేరకు బీసీసీఐకి లేఖ రాశాడు. 

కాగా, 2012 అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్స్ లో ఉన్ముక్త్ అధ్బుత సెంచరీతో రాణించి భారత్ కు ట్రోఫీ అందించాడు. ఆ తర్వాత ఇండియా-ఏకు కెప్టెన్ గా ఎంపికై 2015 వరకు జట్టును విజయవంతంగా నడిపించాడు. అతని ప్రదర్శనతో 2013 చాంపియన్స్ ట్రోఫీ, 2014 టీ20 ప్రపంచ కప్ కు సంబంధించిన 30 మంది ప్రాబబుల్స్ లో చోటు దక్కించుకున్నాడు. 

అయితే ఉన్ముక్త్ చంద్ కు భారత్ జట్టులో ఆడే అవకాశం మాత్రం రాలేదు. టీమ్ ఇండియాకు ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే ఉన్ముక్త్ భారత్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. అలాగే ఐపీఎల్ 2లో ఉన్ముక్త్ ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 

ఉన్ముక్త్ చంద్ 65 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడి 3379 పరుగులు, 120 లిస్ట్ ఏ మ్యాచుల్లో 4505 పరుగులు, ఇక టీ20 క్రికెట్ లో 77 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడి 1565 పరుగులు చేశాడు. ఐపీఎల్ లో 21 మ్యాచుల్లో 300 పరుగులు సాధించాడు.  

Leave a Comment