ఈయన గారి వింత కోరికలు చూశారా..తిట్టి పోస్తున్న నెటిజన్లు..!

ప్రస్తుతం పెళ్లి సంబంధాల కోసం చాలా మంది మ్యాట్రీమోనీ సైట్లను ఆశ్రయిస్తున్నారు. తమ వ్యక్తిగత, కుటుంబ వివరాలతో వెబ్ సైట్ లో ప్రొఫైల్ అప్ లోడ్ చేస్తున్నారు. ఈ ప్రొఫైల్ లో అబ్బాయిలు కానీ, అమ్మాయిలు కానీ తమ అభిప్రాయలు వెల్లడించడం సహజం.. తమకు ఇంత ఎత్తు, కలర్ ఉన్న అమ్మాయిలు కావాలని అబ్బాయిలు అడుగుతుంటారు.. అయితే ఓ వ్యక్తి మాత్రం మ్యాట్రీమోని వెబ్ సైట్ ప్రొఫైల్ లో విచిత్రమైన కోరికలను పొందుపరిచాడు.. ప్రస్తుతం అతడి ప్రొఫైల్ కి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇంతకు అతడు కోరిన కోరికలు ఏమనుకుంటున్నారా.. తనకు కాబోయే భార్య కొలతలు తనకు నచ్చిన విధంగా ఉండాలంటూ అతడు ప్రొఫైల్ లో పేర్కొన్నాడు. ఇంకా తన భార్యకు ఉండాల్సిన లక్షణాలను ఇలా రాసుకొచ్చాడు. ‘సంప్రదాయ విలువలున్న అమ్మాయి కోసం ఎదురుచూస్తున్నాను. 5.2-5.6, 32b-32c, 12-16 సైజులు ఉన్న అమ్మాయి కావాలి’ అని ఇబ్బందికర రీతిలో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. అతడిపై చర్యలు తీసుకున్నట్లు సదరు మ్యాట్రీమోని సంస్థ వెల్లడించింది. 

Leave a Comment