మరో అల్పపీడనం.. ఆ మూడు జిల్లాల్లో భారీ వర్షాలు..!

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఈనెల26 నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. బుధవారం దక్షణ తమిళనాడు-శ్రీలంక తీరంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఆగ్నేేయ బంగాళాఖాతం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని తెలిపింది. దీని ప్రభావంతోనే అల్పపీడనం ఏర్పడుతుందని పేర్కొంది. 

ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి శ్రీలంక-ఉత్తర తమిళనాడు వైపు వెళ్లే అవకాశం ఉందని, ఈనెల 26న తమిళనాడు, శ్రీలంక ప్రాంతాల్లోనే తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో 26,27 తేదీల్లో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో, 27న కడప జల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. 

మరోవైపు నైరుతి బంగాళాఖాతం మధ్య ప్రాంతంపై ఉన్న ఉపరితల ఆవర్తనం దక్షిణ తమిళనాడు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావం వల్ల రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. డిసెంబర్ 15 వరకు నైరుతి బంగాళాఖాతంలో వరుసగా ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు, అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

 

Leave a Comment