ఇండియా టుడే సర్వే : నెక్ట్స్ ప్రధాని కూడా మోడీనే..

ప్రధాని మోడీ ప్రజల్లో ఆదరణ ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టుడే-క్వారీ ఇన్ సైట్స్ మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో తదుపతి ప్రధానిగా నరేంద్ర మోడీయే ఉండాలని 66 శాతం మంది కోరుకుంటున్నారు.  ఇక రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కేవలం 8 శాతం మంది మాత్రమే కోరుకుంటున్నట్లు సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి 5 శాతం ఓట్లు పడ్డాయి. 

ఇక కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రధాని కావాలని 4 శాతం కోరుకుంటుండగా..యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (3 శాతం), కేంద్ర నితిన్ గడ్కరీ(1 శాతం), పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(2శాతం), కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ(2 శాతం), రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ (1 శాతం), మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే(1 శాతం), బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయవతి, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తదితరులు కూడా తదుపరి పీఎం జాబితాలో ఉన్నారు. 

సర్వేలో అడిగిన అంశాలు..

కరోనా కట్టడిలో మోడీ సర్కార్ విజయవంతమైందా? వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తలలు సృష్టిస్తున్న చైనాకు ధీటుగా బదులు ఇచ్చిందా? ఆర్థిక వ్యవస్థ పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారా? ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలు ఏమిటి? ఇప్పటికప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ప్రజలు ఎవరికీ ఓటు వేస్తారు? మోడీ కేబినెట్ లో అత్యుత్తమ మంత్రి ఎవరూ? 

ప్రధాని నరేంద్ర మోడీ పనితీరు ఎలా ఉంది?

బాగుంది- 48 శాతం 

అత్యద్భుతం – 29 శాతం 

పర్లేదు – 18 శాతం 

బాగలేదు – 5 శాతం 

ఎన్డీయే ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది?

బాగుంది – 48శాతం

చాలా బాగుంది – 24శాతం

చెప్పలేం – 19 శాతం

బాగలేదు – 8 శాతం

అసలేమీ చెప్పలేం – 1 శాతం

మోడీ సర్కార్ సాధించిన అతిపెద్ద విజయాలు ఏవి?

ఆర్టిక్ 370 రద్దు – 16 శాతం

రామమందిరం నిర్మాణంపై సుప్రీం కోర్టు తీర్పు – 13 శాతం

మౌలిక సదుపాయాల కల్పన – 11 శాతం

అవినీతి రహిత పాలన – 9 శాతం

నల్లధన నిర్మూలన – 9శాతం

కోవిడ్-19 వ్యాప్తిని కట్టడి చేస్తున్న తీరు – 7 శాతం 

పెద, బలహీన వర్గాల, రైతు సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు – 6 శాతం

నోట్ల రద్దు – 6 శాతం

జీఎస్టీ విధానం – 5 శాతం

స్వచ్ఛ భారత్ – 3 శాతం

మహిళ సాధికారికత – 2 శాతం

మేకిన్ ఇండియా – 2 శాతం

మోడీ ప్రభుత్వం అతిపెద్ద వైఫల్యం ?

కరోనా మహమ్మారిని కట్టడి చేయలేకపోవడం – 25 శాతం

నిరుద్యోగం – 23 శాతం

లాక్ డౌన్ కాలంలో వలస జీవులను ఆదుకోలేకపోవడం – 14 శాతం

ధరల పెరుగుదల- 11 శాతం

ఆర్థిక వ్యవస్థను పట్టిష్టం చేయలేకపోవడం- 7శాతం

ఆరోగ్య రంగాన్ని నీరుగార్చడం – 6 శాతం

రైతులను పట్టించుకోకపోవడం – 6 శాతం

చెప్పలేం – 4 శాతం

చైనా, పాక్, నేపాల్ లతో సత్సంబంధాల విషయంలో – 1 శాతం

జమ్మూకశ్మీర్ లో అశాంతి – 1 శాతం

సీఎఎ నిరసనలు – శాతం

మోడీ కేబినెట్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న మంత్రి?

1.అమిత్ షా – 39 శాతం

2.రాజ్ నాథ్ సింగ్ – 17 శాతం

3.ఇతరులు – 14 శాతం

4.నితన్ గడ్కరీ – 10 శాతం

5.నిర్మలా సీతారామన్ – 9శాతం

6.రవిశంకర్ ప్రసాద్ – 3 శాతం

7.ధర్మేంద్ర ప్రధాన్ – 2

8.స్మృతి ఇరాని – 2 శాతం

9.ఎస్.జైశంకర్ – 1 శాతం

భారత్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య?

కోవిడ్-19 – 70 శాతం

నిరుద్యోగం – 12 శాతం

చైనాతో విభేదాలు, ఆర్థికాభివ్రుద్ధీ నెమ్మదించడం – 4 శాతం

ద్రవ్యోల్బణం- 3 శాతం

అతినీతి, అసహనం – 1 శాతం

ఈ రోజే ఎన్నికలు నిర్వహిస్తే మీరు ఏ పార్టీకి ఓటేస్తారు?

1.బీజేపీ – 283 (సీట్లు)

2.కాంగ్రెస్ – 49

3.ఇతరులు – 211

Leave a Comment