కరోనా కేసుల్లో చైనాను దాటనున్న భారత్..

భారత దేశంలో కరోనా వైరస్ కేసులు తగ్గడం లేదు. గడచిన 24 గంటల్లో 3,967 పాజిటివ్ కేసులు నమోదుకాగా, 100 మంది మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 81,970కు చేరింది. ఇప్పటి వరకు 2,649 మంది మరణించారు. 

కరోనా కేసుల్లో భారత్ చైనాను దాటనుంది. చైనాలో ఇప్పటి వరకు 82,933 కరోనా కేసులు నమోదు కాగా, 4633 మంది మరణించారు. అయితే చైనాతో పోల్చుకుంటే భారత్ లో కాస్తా మరణాల రేటు తక్కువగా ఉంది. ఆదివారం నాటికి భారత్ చైనాను అధికమించే అవకాశాలు ఉన్నాయి. 

ఏపీలో కొత్తగా 57 కరోనా కేసులు

రాష్ట్రంలో గత 24 గంటల్లో 57 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2157కు చేరింది. ఇప్పటి వరకు 48 మంది మరణించగా, 1252 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 857 మంది చికిత్స పొందుతున్నారు. 

గత 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో 14, నెల్లూరు 14, క్రిష్ణా 9, కర్నూలు 8, అనంతపురం 4, విజయనగరం 3, విశాఖపట్నం 2, కడప 2, తూర్పు గోదావరి జిల్లాలో 1 కేసు నమోదైంది. 9,038 శాంపిల్స్ ను పరీక్షించగా 102 మంది కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారించబడ్డారు. వీటిలో 45 కేసులు ఇతర రాష్ట్రాలకు చెందినవిగా గుర్తించారు. 

జిల్లాల వారీగా కేసుల వివరాలు..

 

జిల్లా పేరుకరోనా కేసుల సంఖ్యయాక్టివ్ కేసులు
కర్నూలు599238
గుంటూరు404139
క్రిష్ణా360140
చిత్తూరు16588
నెల్లూరు14056
అనంతపురం12262
కడప10138
పశ్చిమ గోదావరి6924
విశాఖపట్నం6842
ప్రకాశం633
తూర్పు గోదావరి5217
శ్రీకాకుళం73
విజయనగరం77
మొత్తం2157857

 

Leave a Comment