కరోనా బాధిత దేశాల లిస్టులో భారత్..

కోరనా బాధిత  దేశాల్లో భారత్ ను కూడా చేర్చింది ఖతర్. భారత దేశానికి ప్రయాణించరాదని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. మొత్తం 14 దేశాలను కరోనా ఎఫెక్టెడ్ దేశాల లిస్టులో చేర్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇండియాతో బాటు చైనా, ఈజిప్ట్, ఇరాన్, లెబనానా, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, ఫలిప్పీన్స్, దక్షిణ కొరియా, శ్రీలంక, సిరియా, థాయిలాండ్ దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించినట్టు ఈ వర్గాలు పేర్కొన్నాయి. 

ఈ నెల 9 నుంచి ఈ బ్యాన్ అమలులోకి వచ్చింది. ఇటలీ నుంచి వచ్చి, వెళ్లే విమానాలను ఖతార్ రద్దు చేసింది. ఈ దేశంలో కరోనా కేసుల సంఖ్య 15కి పెరిగింది. ఇలా ఉండగా..కరోనా కేసులు నమోదైన దేశాల సంఖ్య 100కి పెరిగింది. మ్రతుల సంఖ్య కూడా 3,800కి పెరిగినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. గత 24 గంటల్లో కొత్తగా మాల్దీవులు, బల్గేరియా, కోస్టారికా, ఫరో దీవులు, ఫ్రెంచ్ గయానా, మాల్టా, మార్టినిక్, రిపబ్లిక్ ఆఫ్ మోల్డోవాలలో కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఇక ఏ విదేశీ నౌక కూడా మన రేవుల్లో చేరకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇటలీ, ఇరాన్, సౌత్ కొరియా, జపాన్ దేశాల నుంచి వచ్చే వారి వీసాలు నిలిపివేశారు. 

భారత్ లో 39 మందికి కరోనాCLICK HERE

Leave a Comment