పెళ్లికి..ఆ ముగ్గురైతే ఓకే..! : తమన్నా

తమన్నా..ఈ మిల్కీ బ్యూటీ గురించి తెలియని వారు ఉండరు. వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉండే తమన్నా ఇప్పటికీ పెళ్లి టాపిక్ ఎత్తడం లేదు. ప్రస్తుతం ఆమె 30కి చేరువైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె పెళ్లి గురించి ప్రస్తావన వచ్చింది. దీనికి సంబంధంచి ఆమె ఆసక్తికరమైన సమాధానమిచ్చింది. ఒక వేళ మీ అమ్మ స్వయంవరం ఏర్పాటు చేస్తే..అని అడిగిన ప్రశ్నకు తమన్నా ఈ విధంగా సమాధానం ఇచ్చింది..

మిల్కీ బ్యూటీ తమన్నాకు భర్తగా ఉండాల్సిన అర్హత ఆ ముగ్గురు హీరోలకే ఉందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పింది. తమన్నా ప్రస్తుతం 30వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఆమె సినీ ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికే 15 సంవత్సరాలు పూర్తయ్యాయి. 2005లో చాంద్ సా రోషన్ చెహ్రా అనే సినిమాతో హిాందీలో అడుగుపెట్టింది. ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లయినా..ఇప్పటికీ ఆమె అందంలో ఎలాంటి తేడా రాలేదు. అదే మంచి ఫిజిక్ ని ఇప్పటికీ మెయిన్ టైన్ చేస్తుంది. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా దాదాపు అందరు హీరోలతోనూ నటించింది. ఇప్పటికీ మంచి అవకాశాలు చేజెక్కించుకుంటుంది. 

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమన్నా పెళ్లి గురించి టాపిక్ వచ్చింది. దీనికి సంబంధించి ఆమె ఆసక్తికరమైన సమాధానమిచ్చింది. ఒక వేళ మీ అమ్మ స్వయం వరం ఏర్పాటు చేస్తే..ఎవరు రావాలనుకుంటున్నారు? అసలు మీకు ఎలాంటి భర్త కావాలి? అన్న ప్రశ్నలకు బదులుగా..ఒక వేళ మా అమ్మ నాకు స్వయంవరం ఏర్పాటు చేస్తే.. విక్కీ కౌశల్, హ్రితిక్ రోషన్, ప్రభాస్ లను కూడా పిలుస్తానని చెప్పింది. వీరి ముగ్గురికే నాకు భర్త అయ్యే అర్హత ఉందని చెప్పేసింది. 

అలాగే ఇది వరకు చాలా సందర్భాల్లో కూడా.. విక్కీ కౌషల్ తో డేటింగ్ కి వెళ్లాలని ఉందని కూడా చెప్పింది. ఈ సమాధానం బట్టి చూస్తే..తమన్నాకు ఎలాంటి వారు కావాలనేది అర్థమైపోయింది. అయితే ఈ లిస్ట్ లో ప్రభావస్ ఉండటం విశేషం. వీరిద్దరూ కలిసి రెబల్, బాహుబలి, బాహుబలి-2 చిత్రాల్లో నటించారు. 

Leave a Comment